రజనీ ఆస్పత్రిలో చేరారని తెలిసి బాధపడ్డా!

తాజా వార్తలు

Published : 26/12/2020 02:18 IST

రజనీ ఆస్పత్రిలో చేరారని తెలిసి బాధపడ్డా!

సూపర్‌స్టార్‌ త్వరగా కోలుకోవాలి: పవన్‌

హైదరాబాద్‌: తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అస్వస్థతకు గురికావడంపై జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఆయన ఆస్పత్రిలో చేరినట్టు తెలిసి బాధపడ్డానన్నారు. కరోనా లక్షణాలు లేవని వైద్యులు ప్రకటించడం ఊరటనిచ్చిందని తెలిపారు. ఈ మేరకు పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

మనోధైర్యం మెండుగా ఉన్న రజనీకాంత్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మికపరులైన ఆయనకు భగవదానుగ్రహం కలగాలని,  ఆయన ఎంతగానో విశ్వసించే మహావతార్‌ బాబాజీ ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో రజనీ మన ముందుకు రావాలని కోరుకుంటున్నట్టు పవన్‌ ప్రకటనలో పేర్కొన్నారు. బీపీలో హెచ్చుతగ్గుల కారణంగా రజనీకాంత్‌ శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి..

అపోలో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని