close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120030263 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => 1sdXEEY4IPk [video_short_link] => 1sdXEEY4IPk [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-03-03 16:26:27.395016 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 03/03/2020 16:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

పార్టీ కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యం: మోదీ

భాజపా ఎంపీలకు సూచించిన మోదీ

దిల్లీ: దేశాభివృద్ధికి శాంతి, సామరస్యం, సమైక్యతే పునాదులని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్టీ కంటే దేశ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ ఎంపీలకు ఉద్బోధ చేశారు. మంగళవారం జరిగిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపైనా విమర్శలు గుప్పించారు. కొంత మంది పార్టీల కోసం, వ్యక్తుల కోసం పనిచేస్తున్నారని పరోక్షంగా విపక్షాలనుద్దేశించి విమర్శించారు. ఇటీవల ఈశాన్య దిల్లీలో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు పార్లమెంటు ఉభయ సభలను వరుసగా రెండోరోజు దిల్లీ అల్లర్ల అంశం కుదిపేసింది. సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఘర్షణల ఘటనపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్‌ ఓం బిర్లా కోరినప్పకటికీ సభ్యులు వెనక్కితగ్గకపోవడంతో లోక్‌సభ వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి తలెత్తడంతో ఛైర్మన్‌ సమావేశాల్ని మధ్యాహ్నానికి వాయిదా వేశారు. 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.