పోలేరమ్మ జాతర: భౌతికదూరమెక్కడ?
close

తాజా వార్తలు

Published : 11/09/2020 15:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోలేరమ్మ జాతర: భౌతికదూరమెక్కడ?

నెల్లూరు: కరోనా వైరస్‌ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా వైరస్‌ మరింత విజృంభించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. ఇలాంటి తరుణంలో నెల్లూరు జిల్లాలో జాతర నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి.నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఈనెల 9వ తేదీ నుంచి పోలేరమ్మ జాతర ప్రారంభమైంది. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, వైకాపా నేతలు పెద్ద ఎత్తున ఈ జాతరలో పాల్గొన్నారు. అమ్మవారి ఊరేగింపుకు వేలమంది భక్తులు హాజరయ్యారు. అయితే, ప్రజల మధ్య ఎక్కడా భౌతిక దూరం కనిపించలేదు. గుంపులు గుంపులుగా జాతరలో పాల్గొన్నారు. కొవిడ్‌ నిబంధనలను బేఖాతరు చేసినప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని