close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 28/02/2020 20:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ఏటీఎంల్లో మార్పులు.. ఆందోళన వద్దు’

దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంల్లో మార్పు(రీకాలిబ్రేషన్‌)ల విషయమై  వస్తున్న వార్తల నేపథ్యంలో.. ఆ విషయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎఫ్‌ఐఎస్‌ ఎండీ(బ్యాంకింగ్‌ సొల్యూషన్స్‌ ఏపీఎంఈఏ) మహేశ్‌ రామమూర్తి ప్రకటించారు. ఈ చర్యల వల్ల వినియోగదారులకు ఏ విధమైన అసౌకర్యం కలగదని ఆయన హామీ ఇచ్చారు. ‘‘రానున్న కొద్ది నెలల్లో భారత్‌లోని 2.4 లక్షల ఏటీఎంల రీకాలిబ్రేషన్‌ అవుతాయని భావిస్తున్నాం. ఈ ప్రక్రియలో భాగంగా రూ.2,000 నోట్లు ఉంచే స్లాట్‌లను రూ.500లతో మారుస్తారు. బ్యాంకులకు, ఏటీఎం నిర్వహణ సంస్థలకు ఈ కార్యక్రమం భారీ కసరత్తు కానుంది. వినియోగదారుల సౌకర్యార్థం.. వారు ఏటీఎంల నుంచి ఎక్కువ సార్లు విత్‌డ్రా చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వినియోగదారులు ఈ విషయమై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్యాంకులతో సంప్రదింపుల అనంతరం మాత్రమే ఈ చర్యలు చేపడతారు. విత్‌డ్రాల సంఖ్యకు అనుగుణంగా ప్రతిఫలాన్ని పొందే బ్యాంకులు, బ్యాకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) కూడా ఈ కార్యక్రమం వల్ల ప్రయోజనం పొందుతాయి. అందువల్ల బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా ఆందోళన చెందనవసరం లేదు’’ అని ఆయన వివరించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.