close

తాజా వార్తలు

Published : 19/10/2020 02:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మోదీ వల్ల వాళ్లకూ మేలే: ఫడణవీస్‌

పట్నా: ప్రధాని మోదీపై ప్రజలకున్న నమ్మకం వల్ల భాజపాకు మాత్రమే కాకుండా మిత్రపక్ష పార్టీలకూ మేలు కలుగుతుందని బిహార్‌ భాజపా ఎన్నికల బాధ్యుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో అధికార, ప్రతిపక్షాలు తమ ప్రచారాన్ని వేగవంతం చేశాయి. విమర్శలు, ప్రతి విమర్శలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో పట్నాలో ఎన్డీయే కూటమి నేతలతో ఫడణవీస్‌ సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడం ఖాయమన్నారు. ‘‘బిహార్‌లో ఎక్కడికెళ్లినా, మోదీ పేరు చెప్పినా విశేష స్పందన కనిపిస్తోంది. దేశ ప్రజానీకం మోదీపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు. దీని వల్ల కేవలం పార్టీకే కాదు.. మిత్రపక్షాలకు కూడా లాభం చేకూరుతుంది’’అని దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు.

మొత్తం 243 శాసనసభ స్థానాలకు గానూ భాజపా 121, ముఖ్యంత్రి నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ 122 స్థానాల్లో బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. జేడీయూ తాను పోటీ చేస్తున్న స్థానాల్లో మిత్రపక్షం జితిన్‌ రామ్‌ మాంఝి నేతృత్వంలోని హిందూస్థానీ అవామ్‌ మోర్చాకు కొన్ని సీట్లు కేటాయించగా.. భాజపా తన కోటా నుంచి 11 సీట్లను వికాస్‌ సీల్‌ ఇన్సాన్‌ పార్టీకి కేటాయించింది. తేజస్వియాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు కలిసి మహాగట్‌బంధన్‌ను ఏర్పాటు చేయగా, దివంగత కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాస్వాన్‌ తనయుడు చిరాగ్‌ పాస్వాన్‌ నేతృత్వంలోని ఎల్‌జేపీ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగుతోంది. బిహార్‌ శాసనసభ స్థానాలకు అక్టోబరు 28 నుంచి మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన