శునకంపై కర్కశం.. కారుకు కట్టి ఈడ్చుకెళ్లి..!
close

తాజా వార్తలు

Updated : 13/12/2020 04:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శునకంపై కర్కశం.. కారుకు కట్టి ఈడ్చుకెళ్లి..!

 

కొచి: కేరళలో అమానవీయ ఘటన జరిగింది. మూగజీవి అన్న కనికరం కూడా లేకుండా ఓ వ్యక్తి తన పెంపుడు శునకం పట్ల కర్కశంగా వ్యవహరించాడు. కుక్క మెడకు తాడు కట్టి తన కారుతో రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. అటుగా వెళ్తున్న మరో వ్యక్తి ఈ దృశ్యాన్ని తన ఫోన్‌లో బంధించడంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.

ఎర్నాకుళం జిల్లా పారావుర్​కు చెందిన యూసుఫ్​.. తన పెంపుడు శునకాన్ని తాడుతో కారుకు కట్టి విచక్షణా రహితంగా రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఈ దృశ్యాన్ని అటుగా బైక్​పై వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి పోలీసులకు సమాచారమిచ్చాడు. అనంతరం యూసుఫ్​ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి  కారును స్వాధీనం చేసుకోవడం సహా అతడి డ్రైవింగ్​ లైసెన్స్ను రద్దు చేశారు. ఐపీసీ సెక్షన్స్​ 428, 429, యానిమల్​ యాక్ట్​ సెక్షన్ 11 (1) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడిన శునకాన్ని స్థానిక పశు వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేయించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని