close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120023439 [video_srlno] => 1 [video_type] => 3 [video_link] => 1229656389695369217 [video_short_link] => 1229656389695369217 [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-02-18 17:19:31.316417 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 18/02/2020 17:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కదిలే రైలులో టిక్‌టాక్‌ స్టంట్‌.. ఖండించిన మంత్రి!

ఇంటర్నెట్‌డెస్క్‌: రైళ్లో నుంచి టిక్‌టాక్‌ వీడియో కోసం ఎంతో ప్రమాదకరంగా స్టంట్‌ చేసిన ఓ వీడియోపై కేంద్ర రైల్వేమంత్రి పీయూష్‌ గోయెల్‌ తీవ్రంగా స్పందించారు. అలాంటి ప్రమాదకర చేష్టలను వ్యక్తుల మూర్ఖత్వంతో పోల్చారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ‘ఓ యువకుడు టిక్‌టాక్‌ వీడియో రూపొందించే క్రమంలో ప్రమాదకరంగా రైలుకు వేలాడుతూ ప్రయాణం చేస్తుంటాడు. ఈ క్రమంలో అతడి కాలు అదుపుతప్పి నేలకు తగలడంతో రైలు నుంచి నియంత్రణ కోల్పోయి కింద పడిపోతాడు. కేవలం అంగుళాల పరిధిలో ఆ యువకుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటాడు’ ఇది వీడియో సారాంశం. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారి కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయెల్‌ దృష్టి వెళ్లింది. దీంతో ఆయన ట్విటర్‌ ద్వారా తీవ్రంగా స్పందించారు. ఆ వీడియో పోస్ట్‌ చేస్తూ.. ‘కదులుతున్న రైలులో ఇలాంటి సాహసాలు చేయడం ధైర్యం చేయడం అనుకుంటున్నారా.. కాదు.. అది మూర్ఖత్వం మాత్రమే. అని అన్నారు. ప్రాణాల మీదకు తెచ్చే ఇలాంటి సాహసాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.