close

తాజా వార్తలు

ప్లాస్టిక్‌ నియంత్రణకు ఇవీ మార్గాలు (ప్రకటన)

ఈ రోజుల్లో టూత్‌ బ్రష్‌ల నుంచి డెబిట్‌ కార్డుల వరకు మనం ఉపయోగించేవన్నీ ప్లాస్టిక్‌తో ముడిపడినవే. మన ఆధునిక జీవితాల్లో భాగమైపోయిన ప్లాస్టిక్‌..  ప్రపంచీకరణకు వెన్నెముకగా మారిందనడంలో సందేహం లేదు. మనదేశంలో రోజుకు 26 వేల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా.. అందులో 10వేల టన్నులు తిరిగి సేకరించకపోవడం గమనార్హం. ప్రభుత్వం 2022 కల్లా ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను నివారించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ దాని అమలు మాత్రం సవాలుగానే మారింది. 1998లో ప్లాస్టిక్‌ నివారణకు సిక్కింతో ప్రారంభమైన ఈ ప్రక్రియను నిర్వహించడంలో రాష్ట్రాలు గొప్పగా పని చేశాయి. కానీ నిజమైన సవాలు ఉపయోగించిన ప్లాస్టిక్ నిర్వహణలోనే ఉంటుంది. ప్లాస్టిక్‌ను వ్యర్థంగా పరిగణించడం ఆపి.. న్యూస్‌పేపర్‌లా పునర్వినియోగానికి వినియోగించే ఆలోచన చేస్తే మేలైన ఫలితాలు వస్తాయి. మన నగరాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు పెద్ద సమస్య. దీని కారణంగా కాలువల్లో అవి నిండిపోయి వరదలు ముంచెత్తుతున్నాయి. చేపలు ఇతర జీవులు మరణిస్తున్నాయి. కాబట్టి ఈ రీసైకిల్‌ చేయని ప్లాస్టిక్‌ ద్వారా భూప్రపంచం ఉక్కిరిబిక్కిరి కాకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచేలా మనమేం చేయాలో ఇక్కడ చూద్దాం..

మీ అలవాట్లు మార్చుకోండి..

మీ రాష్ట్రంలో తక్కువ మైక్రాన్‌ పరిమాణం గల ప్లాస్టిక్‌ సంచులపై నిషేధం ఉంటే ఆ విధానాన్ని మీరు గౌరవించాలి. కిరాణా, కూరగాయలు కొనే సమయంలో పలుచటి ప్లాస్టిక్‌ బ్యాగులను స్వీకరించకూడదు. మార్కెట్‌ వెళ్లే సమయంలో మీరే స్వయంగా క్లాత్‌ బ్యాగులను తీసుకెళ్లండి. ఆన్‌లైన్‌ వ్యాపారులు నుంచి నో ప్యాకేజింగ్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోండి. పర్యావరణహితంగా ఉండే వస్తువులను ఉపయోగించేలా యువతరాన్ని ప్రోత్సహించాలి.

చెత్తలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను వేరు చేయడం ముఖ్యం

ఇప్పటికే మున్సిపాలిటీలు తడిచెత్త, పొడిచెత్త వేరు చేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. ఆవిధంగా అందరూ తాము నిత్యం ఉపయోగించే కూరగాయల వ్యర్థాలను, షాంపూ కవర్లు, ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగుల వ్యర్థాలను వేరు చేసి చెత్త బుట్టలో వేయాలి. అలా చేయడం ద్వారా మున్సిపాలిటీ వారు ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైక్లింగ్‌కు పంపడానికి అనుకూలంగా ఉంటుంది. లేదా ఇలాంటి ప్లాస్టిక్‌ వ్యర్థాలను తీసుకోవడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి వారికి అందజేసినా సరిపోతుంది. 

పునర్వినియోగం, పునరుద్ధరణ

సహజంగా భారతీయులు వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ బ్యాగులను తిరిగి ఉపయోగించుకుంటారు. కానీ సింగిల్‌ యూజ్ ప్లాస్టిక్ వాడకం పెరుగుతుండటంతో కొత్తది వచ్చినప్పుడు పాత వాటిని పారేస్తున్నారు. అలా చెత్త బుట్టలో వేసిన పాత ప్లాస్టిక్‌ను మున్సిపాలిటీ వారు సేకరించి వాటిని పునరుద్ధరించేందుకు సంబంధిత పరిశ్రమలకు తరలిస్తారు. ఇప్పటికే హౌజ్‌కీపింగ్‌ సొసైటీల్లోనూ వేరు చేసిన చెత్తను సరైన రీసైక్లింగ్‌ ఏజెన్సీలకు పంపించడానికి శిక్షణ ఇచ్చారు. ప్రతి ప్లాస్టిక్‌ వ్యర్థం పునరుద్ధరిస్తే వినియోగానికి నోచుకుంటుంది. అధిక గాఢత ఉన్న ఇథైలిన్‌ క్లోరైడ్‌ను రీసైకిల్ చేయడం ద్వారా ప్లాస్టిక్‌ బాటిల్స్‌, గృహోపకరణ వస్తువులు తయారవుతాయి. పాలి వినైల్‌ క్లోరైడ్‌ను రీసైకిల్‌ చేయడం ద్వారా తోటల్లో ఉపయోగించే పైపులు, ట్రాఫిక్‌లో ఉపయోగించే నియంత్రికలు (డివైడర్‌ వస్తువులు) తయారవుతాయి. రీసైకిల్‌ చేసిన పాలిస్టరిన్‌ను చెత్త సంచులు తయారీకి ఉపయోగపడుతుంది. కార్పెట్లు, కటింగ్‌ బోర్డులు తదితర వస్తువులు ఉపయోగించిన ప్లాస్టిక్‌ నుంచే తయారవుతున్నాయి. 

ప్రచారం చేయండి

ప్లాస్టిక్‌ను విస్మరించామనేది మనం నిర్ధారించుకోగలిగితే దాని ప్రయోజనాలను మనం ఇంకా శతాబ్దం పాటు పొందవచ్చు. మన చుట్టుపక్కల వారు, తోటి ఉద్యోగులు, స్నేహితులు ప్లాస్టిక్‌ వ్యర్థాలను ప్రత్యేకంగా వేరు చేయడం వంటి సరైన మార్గాలను అమలు చేసేవిధంగా ప్రోత్సహించాలి. ప్లాస్టిక్‌కు ఉన్న ప్రత్యామ్నాయాల గురించి తెలియని యువ తరాలకు తెలియజేయాలి. షాపింగ్‌ వెళ్లే సమయంలో ప్లాస్టిక్‌ క్యారీబ్యాగులకు బదులు క్లాత్‌ బ్యాగులు తీసుకెళ్లేలా సూచించాలి. అలా మీరు వేసే ఒక చిన్న ముందడుగు ఈ భూమండలాన్ని కాపాడుతుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.