close
Array ( ) 1

తాజా వార్తలు

దయచేసి మమ్మల్ని వెళ్లనివ్వండి: ఉతప్ప

ముంబయి: సెంట్రల్‌ కాంట్రాక్టు పొందని క్రికెటర్లు విదేశీ లీగుల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతివ్వాలని వెటరన్‌ క్రికెటర్‌ రాబిన్‌ ఉతప్ప విజ్ఞప్తి చేశాడు. ఒక స్థాయిలో సుదీర్ఘకాలం ఆడి మళ్లీ దేశవాళీకి వెళ్లాలంటే కాస్త సమయం పడుతుందని పేర్కొన్నాడు. మానసికంగా సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించాడు.

‘దయచేసి మమ్మల్ని (విదేశీ టీ20 లీగులకు) వెళ్లనివ్వండి. ఎందుకంటే, సుదీర్ఘకాలం ఒక స్థాయిలో క్రికెట్‌ ఆడి మళ్లీ దేశవాళీకి వెళ్లాలంటే సమయం పడుతుంది. ప్రపంచంలోని ఇతర లీగుల్లో ఆడేందుకు అనుమతించకపోతే ఆటగాళ్లకు బాధేస్తుంది. రెండు, మూడు విదేశీ లీగులు ఆడితే బాగుంటుంది. ఒక క్రికెట్‌ విద్యార్థిగా నేర్చుకొనేందుకు ఇవి ఉపయోగపడతాయి’ అని ఉతప్ప అభిప్రాయపడ్డాడు.

ఇర్ఫాన్‌ పఠాన్‌తో మాట్లాడుతూ సురేశ్‌ రైనా సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ‘కాంట్రాక్టు పొందని ఆటగాళ్లు ఇతర లీగుల్లో ఆడేందుకు బీసీసీఐ ఏదో ఒకటి చేయాలి. విదేశీ లీగుల్లో ఆడేందుకు అనుమతించాలి. ఎంతోమంది ఆటగాళ్లు వీటి నుంచి నేర్చుకోగలరు’ అని రైనా అన్నాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.