225 మంది పోలీసులకు కరోనా: మహేశ్‌ భగవత్‌
close

తాజా వార్తలు

Updated : 24/04/2021 13:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

225 మంది పోలీసులకు కరోనా: మహేశ్‌ భగవత్‌

హైదరాబాద్: కరోనా సెకండ్‌ వేవ్‌లో రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 225 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. ఇప్పటికే కమిషనరేట్‌ పరిధిలో 95శాతం మంది సిబ్బందికి వ్యాక్సిన్‌ పూర్తి అయిందని.. మిగిలిన వారికి కూడా వేయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కొవిడ్ పాజిటివ్‌ వచ్చిన వారిలో ఆత్మస్థైరం పెంపొందించేందుకు తనతోపాటు ఇతర అధికారులు జూమ్‌ ద్వారా తరచూ మాట్లాడుతున్నామని, వీరిలో కేవలం నలుగురు మాత్రమే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వైరస్‌ బారిన పడ్డవారికి మెడికల్‌ కిట్స్‌, డ్రైఫ్రూట్స్‌ కిట్స్‌తోపాటు రూ. 5వేలు వారి ఖాతాల్లో వేస్తున్నామన్నారు.

200 కేసులు నమోదు..

రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో కర్ఫ్యూ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ తెలిపారు. కమిషనరేట్‌ పరిధిలో 43 ప్రాంతాల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సిబ్బంది ఉంటారని పేర్కొన్నారు. ఇప్పటివరకు కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించినందుకు 200 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ఈ వారం రోజుల వ్యవధిలో మాస్కులు ధరించని వారిపై 16వేల కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 90శాతం దుకాణాలు, బార్లు, మద్యం దుకాణాలు, కార్యాలయాలు రాత్రి 8 గంటలకు మూసివేస్తున్నారన్నారు. నిర్దేశించిన సమయంలో కర్ఫ్యూ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని