close

తాజా వార్తలు

Published : 26/03/2020 02:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రజాశ్రేయస్సుకే దేశవ్యాప్త లాక్‌డౌన్‌!

ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా మరణమృదంగం మోగిస్తున్న కరోనా వైరస్‌ కట్టడికి లాక్‌డౌన్‌ చేయడమే సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు సామాజిక దూరం పాటించడంతోపాటు కొన్నిరోజులపాటు ఇళ్లకే పరిమితమైతే వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. దీనిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే చాలా దేశాలు లాక్‌డౌన్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా భారత ప్రభుత్వం తీసుకున్న 21రోజుల లాక్‌డౌన్‌పై అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ఇంతకుముందే ఈ నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని కొందరు భావిస్తుండగా.. మరికొందరు మాత్రం ఇదే సరైన సమయమని, ప్రజలు దీనికి సహకరించాలని కోరుతున్నారు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలకు భరోసా కల్పిస్తూ వారికి కావాల్సిన నిత్యవసర వస్తువులను అందుబాటులో ఉంచాలని సూచిస్తున్నారు.

‘కరోనాపై పోరాటంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం ఎంతో ముఖ్యమైంది. ఈ విపత్కర సమయంలో యావత్‌ దేశం కేంద్రప్రభుత్వం వెన్నంటే ఉంటుంది. ఈ 21 రోజుల సమయంలో దిల్లీ వాసులకు కావాల్సిన నిత్యవసర సరకుల్లో ఎలాంటి కొరతా ఉండబోదు. ఈ క్లిష్ట సమయంలో ప్రతివ్యక్తి అవసరాన్ని గుర్తించి పరిగణలోకి తీసుకుంటాం’

- అరవింద్‌ కేజ్రీవాల్‌, దిల్లీ ముఖ్యమంత్రి

‘కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ప్రతి పౌరుడూ భేదభావం లేకుండా కుల, మతాలకతీతంగా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. భారతదేశానికి ఉజ్వల భవిష్యత్‌ను నిర్మించడంలో ఈ 21 రోజులు చారిత్రక పాత్ర పోషిస్తాయి. కరోనా వైరస్‌పై పోరాటం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సమయంలో పేదలకు సబ్సిడీలు కల్పించాలి.’

-అఖిలేశ్‌ యాదవ్‌, ఎస్పీ అధ్యక్షుడు

‘ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ కట్టడిచేయడంలో ప్రతిఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలి. అంతేకాకుండా ఈ సమయంలో బయటకు వెళ్లకుండా ఇంటికే పరిమితం కావాలి.’ 

-శరద్‌ పవార్‌, ఎన్సీపీ అధినేత

‘ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితి పూర్తిగా ఎదుర్కొన గలిగిందే. ఈ పరిస్థితికి ముందు సమయం కూడా లభించింది. ఆ సమయంలోనే రాబోయే ఆపదను తీవ్రంగా పరిగణించి ఉంటే మరింత సంసిద్ధంగా ఉండేవాళ్లం.’

-రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ నేత


 




Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన