
తాజా వార్తలు
పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్యకు కరోనా
గుంటూరు: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకినట్టు ఆయనే స్వయంగా వీడియో ద్వారా వెల్లడించారు. ఎలాంటి జలుబు, జ్వరం లక్షణాలు కనిపించలేదని తెలిపారు. పాజిటివ్ వచ్చిందని తెలియగానే హోం క్వారంటైన్‌కు వెళ్లానన్నారు. అందరి అభిమానతో త్వరలోనే కోలుకుంటానని విశ్వాసం వ్యక్తంచేశారు.
Tags :