close

తాజా వార్తలు

Published : 23/10/2020 02:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘‘హైదరాబాద్‌ దుస్థితికి అదే కారణం’’

ఇంటర్నెట్‌ డెస్క్‌: చెరువుల ఆక్రమణ, సరైన మురుగునీటి వ్యవస్థ, వరద కాల్వలు లేకపోవటం, పాలకుల నిర్లక్ష్యం ప్రస్తుత హైదరాబాద్ దుస్థితికి కారణమంటున్నారు 'సేవ్ లేక్స్ ' ఉద్యమకారులు, ఇంటాక్ సంస్థ హైదరాబాద్ చాప్టర్ కన్వీనర్ పి.అనురాధారెడ్డి. హైదరాబాద్‌తో పాటు దేశవిదేశాల్లో పలు చెరువులు పురాతన కట్టడాల గురించి ఆమె సుదీర్ఘకాలం అధ్యయనం చేశారు.  ప్రస్తుతం హైదరాబాద్‌లో తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో ఈనాడు, ఈటీవీతో తన అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు. ‘‘హైదరాబాద్‌లో ఉన్న చెరువులు అలనాటి పాలకులు మనకు ఇచ్చిన వరం. నగర వాసులకు బతుకుదెరువు నిచ్చింది చెరువులే. అప్పటి పాలకులు ముందు చూపుతో వాటిని ఏర్పాటు చేశారు. వాటి నుంచి మనకు ఎంతో ప్రయోజనం చేకూరింది. చాలా ఏళ్ల వరకు హుస్సేన్‌సాగరే హైదరాబాద్‌కు తాగునీరు అందించింది. అలాంటిది నేడు కాలుష్యమయం అయిపోయింది. చెత్తాచెదారం ఇతరత్రా వ్యర్థాలతో దీనిని కలుషితం చేసేశారు’’ అని ఆమె వివరించారు.

 

చెరువుల ఆక్రమణలకు కారణాలివే...
నగరంలోని చాలా చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని ప్రస్తుత పరిస్థితులకు ప్రధాన కారణం అదేనంటున్నారామె. ‘‘అప్పట్లో చిన్నవీ, పెద్దవీ కలిపి 3 వేల వరకు చెరువులుండేవి. ఈ చెరువులు, నాలాలు ఉన్న స్థలాలను ఆక్రమించుకొని ఎంతోమంది ఇళ్లు నిర్మించుకోవడం వంటివి చేశారు. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. జీవించటానికి సరైన పరిస్థితులు లేకపోవటంతో చాలా మంది ప్రజలు జిల్లాల నుంచి రావటం, నివసించడానికి స్థలాలు లేక చెరువులు, నాలాలు ఉన్న ప్రదేశాల్లో ఇళ్లు కట్టుకోవటం అనేది ఒక కారణమైతే. డబ్బులున్న వారు కొన్ని చోట్ల స్థలాలను కొని వాటిని రకరకాల కంపెనీలు తదితరాల నిర్మాణం కోసం ఉపయోగించటం అనేది రెండో కారణం. 1980ల నాటి నుంచే ప్రభుత్వాలకు చెరువులు, నాలాల ఆక్రమణల గురించి ఎన్నోసార్లు విన్నవించాం. చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వాలకు అనేక సిఫారసులు చేశాం. ఎఫ్‌టీఎల్‌ ప్రొటెక్షన్‌, మొక్కల పెంపకం వంటి ఎన్నో అంశాలను సూచించాం. అయినా పట్టించుకునే వారే కరవయ్యారు. పౌరులు కూడా బాధ్యతా రాహిత్యంగా ఉండటమూ కారణమే. గతంలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థలు, తదితరాల కారణంగా ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ ఆక్రమణలు జరిగాకే ఈ దుస్థితి వచ్చింది. హెచ్‌ఎమ్‌డీఏ నుంచి కొంత వరకు సహకారం లభించింది. అయితే ఎవరూ కూడా ప్రజలను పరిరక్షణలో భాగస్వాములుగా మార్చలేదు. ఏదేమైనా వీటన్నింటికీ పాలకుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం అనటంలో సందేహం లేదు. మారిన పరిస్థితులకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించలేదు. అదేవిధంగా నగరీకరణకు అనుగుణంగా వరదకాలువలు, మురుగునీటి వ్యవస్థలూ నిర్మించలేదు. ఇప్పటికైనా ఆక్రమణలు, కాలుష్యం విషయంలో చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని విపత్కర పరిస్థితులు ఎదురవుతాయనటంలో సందేహం లేదు’’ అని హెచ్చరించారు.

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.