భారీ సంస్కరణ: 65+ వారికి పోస్టల్‌ బ్యాలెట్‌
close

తాజా వార్తలు

Published : 03/07/2020 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారీ సంస్కరణ: 65+ వారికి పోస్టల్‌ బ్యాలెట్‌

కొవిడ్-19 నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ప్రకటన‌

దిల్లీ: ఇకపై 65 ఏళ్ల పైబడిన వారు పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించి ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చింది. వయసు పైబడిన వారు, మధుమేహం, రక్తపోటు ఉన్న వారికి కొవిడ్‌-19 ముప్పు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అక్టోబర్‌-నవంబర్‌లో బిహార్‌ శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం.

వైరస్‌ విజృంభణ దృష్ట్యా ఏదేమైనప్పటికీ వృద్ధులు బయటకొచ్చేందుకు అనుమతి ఇవ్వకూడదని వైద్యవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వారే కాకుండా మధుమేహ రోగులు, రక్తపోటుతో బాధపడుతున్న వారు, గర్భిణులు బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. అలాంటి వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం ఉపయుక్తంగా ఉండనుంది.

గతంలో పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం 80 ఏళ్లకు పైబడినవారికి, ఇతర రాష్ట్రాల్లో అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి ఉండేది. ఇప్పుడు 80 నుంచి 65 ఏళ్లకు కుదించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని