
తాజా వార్తలు
సన్నబడ్డ ప్రభాస్.. ఫొటోలు వైరల్
హైదరాబాద్: రెబల్‌స్టార్ ప్రభాస్ న్యూలుక్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆయన సన్నబడ్డట్టు కనిపిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిలో డార్లింగ్ గత కొంతకాలంగా కనిపిస్తున్న లుక్కు భిన్నంగా, స్మార్ట్‌గా ఉన్నారు. కసరత్తులు చేసి మరీ కండలు తగ్గించినట్లు తెలుస్తోంది. ‘రాధేశ్యామ్’ తర్వాతి సినిమా కోసం ఈ లుక్‌లో సిద్ధమైనట్లు ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ శారీరకంగా మారిన తీరు ఎంతో నచ్చిందని, హ్యాండ్సమ్గా ఉన్నారని తెగ పోస్ట్‌లు చేస్తున్నారు. దీంతో ఫొటోలు కాస్త వైరల్‌గా మారాయి.
‘సాహో’ తర్వాత ప్రభాస్ నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ సినిమా తుది షెడ్యూల్ హైదరాబాద్‌లోని ఓ ఫిల్మ్ స్టూడియోలో ఏర్పాటు చేసిన భారీ సెట్లో జరుగుతోంది. ఇప్పటికే దర్శకుడు రాధాకృష్ణ, తదితర చిత్ర బృందం షూటింగ్ పనులు చూసుకుంటున్నారు. త్వరలోనే ప్రభాస్, పూజా హెగ్డే చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు. క్లైమాక్స్ సీన్ కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పోవెల్ పనిచేయనున్నారట. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కాబోతోంది.
ఇటీవల ప్రభాస్ ‘ఆదిపురుష్’తోపాటు నాగ్ అశ్విన్ తెరకెక్కించబోతున్న మరో చిత్రానికి సంతకం చేశారు. ఈ రెండు ప్రాజెక్టులు 2021లో ఆరంభం కాబోతున్నాయి. ‘తానాజీ’ ఫేం ఓం రౌత్ దర్శకత్వం వహించబోతున్న ‘ఆదిపురుష్’ 2022 ఆగస్టు 11న విడుదల అవుతుందని చిత్ర బృందం ప్రకటించింది. ఇందులో దీపికా పదుకొణె, సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- మరో 6 పరుగులు చేసుంటే..
- నేను తెలుగింటి అల్లుడినే: సోనూసూద్
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్ 336 ఆలౌట్
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- బైడెన్ తొలి సంతకం వీటిపైనే..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
