‘ప్రాణాయామం జీవన విధానంలో భాగం కావాలి’
close

తాజా వార్తలు

Published : 21/06/2020 07:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ప్రాణాయామం జీవన విధానంలో భాగం కావాలి’

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ

దిల్లీ: కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ సంవత్సరం ఇంట్లోనే ఉండి యోగా దినోత్సవం జరపుకోవాల్సి వస్తోందని ప్రధాని మోదీ అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి యోగా చేయాలని పిలుపునిచ్చారు. తద్వారా ఇంట్లో సభ్యుల మధ్య బంధం మరింత బలోపేతం అవుతుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆన్‌లైన్‌ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా ఉద్ధృతి దృష్ట్యా సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాం అని గుర్తుచేశారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రపంచ దేశాలూ యోగా ప్రాముఖ్యతను గుర్తించాయని తెలిపారు. ప్రజలందరినీ ఐక్యం చేయడంలో.. సౌభ్రాతృత్వాన్ని పెంచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు.  

కరోనా వ్యాప్తి నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి యోగాలో అనేక ఆసనాలున్నాయని తెలిపారు. శ్వాస వ్యవస్థపై కొవిడ్‌ తీవ్ర ప్రభావం చూపుతున్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రాణాయామం ద్వారా దాన్ని అధిగమించొచ్చని తెలిపారు. రోజువారీ జీవన విధానంలో ప్రాణాయామాన్ని భాగం చేసుకోవాలని సూచించారు. రోగాలను దీటుగా ఎదుర్కొనేందుకు అనేక రకాల ప్రాణాయామాలు, యోగాసనాలను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని