
తాజా వార్తలు
మదుపు చేయండి.. సందేహం లేకుండా..
ఏదైనా కారు లేదా మొబైల్ కొనే సమయంలో ఎంతో పరిశోధన చేస్తుంటాం మనం. అంత త్వరగా నిర్ణయానికి రాం. అలాగే పెట్టుబడుల విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. అయితే స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడూ బ్మహ్మపదార్థంగానే తోస్తుంటుంది. చాలా అనుమానాలు మన మెదడును తొలిచేస్తుంటాయి. పెట్టుబడిని ఏ షేరులో, ఎంత మొత్తం, ఎప్పుడు పెట్టాలి? ఎవరిని అడిగితే మంచిది? ఎంత కాలం వేచి చూడాలి? ఇలాంటి అనుమానాలకు అంతే ఉండదు. అయితే ఈ ఆరు అనుమానాలకు మీరు సమాధానం వెతుక్కుంటే.. మిగతా వాటికీ సమాధానం వచ్చేస్తుంది. |
త్వరగానా.. ఆలస్యంగానా
పెట్టుబడులు ఎంత తక్కువ వయసులో ప్రారంభిస్తే అంత మేలు. ఆలస్యమయయ్యే కొద్దీ తక్కువ ప్రతిఫలాలు వస్తాయి. ఆలస్యంగా ఎంత భారీ పెట్టుబడులు పెట్టినా అనవసర నష్టభయాలు వెన్నాడతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదీకాక ఆలస్యంగా పెట్టుబడులు పెడుతున్నాం కదా అని ఎక్కువ ప్రతిఫలాలనిస్తామంటూ ఊరించే కొంత మంది వ్యక్తులు, పథకాల వైపు వెళ్లకూడదు. ముందుగా మ్యూచువల్ ఫండ్లలో మదుపుతో మొదలుపెట్టాలి. దీర్ఘకాలంలో షేర్లు ద్రవ్యోల్బణం, మార్కెట్ ఊగిసలాటలను తట్టుకుంటాయి. ఎప్పుడయినా సరే.. ఆలస్యంగా లేచే పక్షికి ఆహారం తక్కువగా లభిస్తుందని గుర్తుంచుకోవాలి.
మెదడా.. మనసా..
ప్రతీ పెట్టుబడుదారుకు ఒక ఫేవరెట్ కంపెనీ ఉంటుంది. కొంత మంది ఎంతలా వాటిని ప్రేమిస్తారంటే.. దానిపై ప్రతికూల వార్తలు వచ్చినా పట్టించుకోరు. ఈ సమయంలో మెదడుపై మనసు ఆధిపత్యం చలాయిస్తుంది. సరైన నిర్ణయం తీసుకునే విచక్షణను కోల్పోతారు. అది కాస్తా.. మన పెట్టుబడులను నష్టాల వైపు పయనింపజేస్తోంది. పెట్టుబడుల నిర్ణయాల విషయంలో ఎపుడూ భావోద్వేగానికి గురికాకూడదు. ముఖ్యంగా మీరు ట్రేడింగ్ చేసే సమయంలో. ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. మీకు ట్రేడింగ్ చేయడం చాలా సులువు. స్వల్పకాలంలోనే ఎక్కువ డబ్బులు సంపాదిస్తాను అన్న నమ్మకం ఉండొచ్చు. అయితే మీ పోర్ట్‌ఫోలియోలో స్వల్పకాలానికి పెట్టుబడులు కేటాయించడంతో పాటు.. దీర్ఘకాల ప్రయోజనాలనందించే పెట్టుబడులకూ డబ్బులు కేటాయించాలి. ఇందులో మనసు మాట కాదు.. మెదడు మాటే వినాలి.
రహదారా.. గమ్యమా
ఏదో ఒక దారిలో వెళ్లడం కాదు.. గమ్యం చేరే దారిలో వెళుతున్నామా లేదా అన్నదే ముఖ్యం. చాలా మంది మదుపర్లు కూడా తమ వద్ద అదనపు నగదు ఉంది కదా అని డబ్బులు తీసుకెళ్లి మార్కెట్లో పెడుతుంటారు. ఒక్కసారిగా భారీ లాభాలు వస్తాయని భావిస్తుంటారు. అది ఎంత మాత్రం సాధ్యం కాదు. ఎటువంటి లక్ష్యం లేకుండా పెట్టుబడులు పెట్టేవారు వాటిని సమీక్షించడం.. అందుకు తగ్గట్లుగా పెట్టుబడులను సర్దుబాటు చేయడం మరుస్తుంటారు. అనసరంగా ఒక షేరు నుంచి ఇంకో షేరుకు మారుతుంటారు. పెళ్లి, పదవీ విమరణ, పిల్లలు చదువు, ఇల్లులాంటివి ఎవరి జీవితంలోనైనా ఎక్కువ డబ్బులు పెట్టే విషయాలు. వీటికి సరైన ప్రణాళిక, సరైన నిధులు, సరైన అమలు అవసరమని గుర్తుంచుకోవాలి.
క్రమశిక్షణా.. నిర్లక్ష్యమా..
క్రమశిక్షణ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించేవారికి పెట్టుబడులపై ప్రతిఫలాలు అంతగా రావు. ఏవో ఒక షేర్లు లేదా ఫండ్లపై నచ్చినట్లుగా పెట్టుబడులు పెట్టడం.. బయట ఎవరో చెప్పారని వాటిని అమ్మేయడం వంటివి చేస్తుంటారు. అవి మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు. అంతే కష్టం.. అంతే క్రమశిక్షణతో ముందుగా మీరు పెట్టదలచుకున్న షేరు లేదా కంపెనీపై పరిశోధన చేయాలి. దాని విలువ, గతంలో పనితీరు, యాజమాన్యం, ఆ కంపెనీ పోటీదార్లు ఇలా అన్నీ పరిశీలించాలి. ఒక్కసారి మంచిదని అనిపించాక.. పెట్టుబడులు పెట్టాక.. కూడా క్రమం తప్పకుండా సమీక్షిస్తుండాలి. క్రమశిక్షణ వల్ల స్పష్టత, విశ్వాసం కలిగి.. మీ డబ్బులకు ప్రతిఫలాలను తెచ్చిపెడుతుంది.
అవగాహనా.. అవగాహన లేమా..
అందరూ ‘ఆ ఒక్క కంపెనీ’ గురించే మాట్లాడుకుంటున్నారు. మనమూ పెట్టుబడులు పెడితే సరిపోతుంది కదా.. అనుకుంటుంటారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే మదుపర్లను ఆకట్టుకోవడానికి వివిధ మార్గాల్లో మీ కళ్లు వాటిపై పడేలా చేసుకుంటారు. సదరు షేరు గురించి మీకేమీ తెలియకపోతే.. మీరు ఎవరి ప్రభావానికైనా గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా షేరులో మీరు డబ్బులు పెడుతున్నారంటే.. మీరు ఆ కంపెనీకి పాక్షిక యజమాని అయినట్లే లెక్క. మీ సొంత వ్యాపారంలో మీరు పెట్టుబడులు పెట్టే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో అలాగే ఇక్కడా ఆలోచించాలి. చాలా లోతుగా పరిశీలించిన మీదటే ఒక నిర్ణయానికి రావాలి.
ఒక్కటా.. అంతకంటే ఎక్కువా
ఏదో ఒక్క షేరు లేదా కంపెనీ లేదా పెట్టుబడి సాధనాన్ని నమ్ముకోకూడదు. ఎందుకంటే అది బాగా పనిచేస్తే సరే. లేదంటే పరిస్థితి ఏమిటి? ఉన్న డబ్బులన్నీ పోవాల్సిందేనా. అందుకే మీ పోర్ట్‌ఫోలియో వైవిధ్యంగా ఉండేలా చూసుకోవాలి. వేర్వేరు షేర్లను ఎంచుకోవడంలో విఫలమైతే నష్టభయాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి మరి. చిన్న షేర్లు, పెద్ద షేర్లు, ఈక్విటీ, డెట్, కమొడిటీ, బంగారం.. ఇలా అన్నిటిలోనూ మీ డబ్బులను పంచాలి. వీటిలో ఏదో ఒక గుర్రం చతికిలబడ్డా.. మిగతా గుర్రాలు మీ లాభాల బండిని ముందుకు తీసుకెళతాయి.
- తుషార్ బాప్చే, ప్రొడక్ట్ హెడ్, యెస్ సెక్యూరిటీస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
- డీఎం సాబ్.. నేను తేజస్వి మాట్లాడుతున్నా..
- ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..
- స్వాగతం అదిరేలా..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
