close

తాజా వార్తలు

Published : 24/11/2020 10:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొత్త విమానంలో తిరుమలకు రాష్ట్రపతి

దిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొద్ది సేపటి క్రితం దిల్లీ నుంచి తిరుమలకు బయల్దేరారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రయాణించేందుకు ప్రత్యేకంగా తయారు చేయించిన ఎయిర్‌ ఇండియన్‌ వన్‌ బీ777 విమానాన్ని ఈ సందర్భంగా రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రారంభించారు. ఆ విమానంలోనే తొలిసారిగా దిల్లీ నుంచి చెన్నైకి బయల్దేరారు. ప్రయాణ సమయంలో విమానం లోపలికి తక్కువ శబ్దం వినిపించేలా, అధునాతన సౌకర్యాలతో విమానం తయారు చేశారు. గతంలో ఉన్న వీఐపీ విమానంతో పోలిస్తే ఇది.. అధిక ఇంధన సామర్థ్యంతో పనిచేస్తుంది.

చెన్నై నుంచి తిరుమలకు..

చెన్నై నుంచి వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ఉదయం 10.30 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందణ్‌, ముఖ్యమంత్రి జగన్‌ ఆయనకు స్వాగతం పలుకుతారు.  రాష్ట్రపతితో పాటు గవర్నర్‌ తిరుచానూరు చేరుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని మధ్యాహ్నం 12.15 గంటలకు తిరుమలలోని విశ్రాంతి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.05 గంటలకు క్షేత్రసంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ వరాహస్వామివారిని దర్శించుకుని మహద్వారం ద్వారా ఆలయ ప్రవేశం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. సాయంత్రం 4 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి విమానాశ్రయం చేరుకొని సాయంత్రం 4.50 గంటలకు చెన్నైకు తిరుగు ప్రయాణమవుతారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన