అట్టహాసంగా వైమానిక దళ దినోత్సవం
close

తాజా వార్తలు

Updated : 08/10/2020 11:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అట్టహాసంగా వైమానిక దళ దినోత్సవం

రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు

దిల్లీ/ఘజియాబాద్‌: భారత వైమానిక దళం 88వ వ్యవస్థాపక దినోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. దిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌ ‘హిండన్‌ ఎయిర్‌స్టేషన్’‌లో ఈ వేడుకలు జరిగాయి. ఎయిర్‌ఫోర్స్‌డేను పురస్కరించుకుని వైమానిక దళం పరేడ్‌ నిర్వహించింది. దీనిలో వాయుసేనకు చెందిన 56 విమానాలు పాల్గొన్నాయి. తేజస్‌, జాగ్వర్‌, సుఖోయ్‌ సహా 19 యుద్ధ విమానాలు, 19 హెలికాప్టర్లు వీటిలో ఉన్నాయి. ఇటీవలే వైమానిక దళంలో చేరిన రఫేల్‌ యుద్ధ విమానాలను కూడా ఈ పరేడ్‌లో పాల్గొన్నాయి. 

వాయుసేన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ సహా పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వీరులకు కృతజ్ఞతలు తెలిపారు. 

* భారత గగనతలాన్ని రక్షించడంలో, విపత్కర పరిస్థితుల్లో ప్రజలను కాపాడటంలో ఐఏఎఫ్‌ చేస్తున్న కృషికి దేశం రుణపడి ఉంటుంది. రఫేల్‌, అపాచీ, చినూక్‌ వంటి అధునాతన యుద్ధవిమానాలతో ఐఏఎఫ్‌ మరింత  బలమైన, వ్యూహాత్మక దళంగా మారింది - రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 

* వైమానిక దళ సిబ్బందికి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. వాయుసేన యోధులు ధైర్యానికి, శౌర్యానికి ప్రతీకలు. యుద్ధం, శాంతిభద్రతలను పరిరక్షించడంలో దేశం గర్వపడేలా సేవలందిస్తున్నారు. కీర్తిప్రతిష్ఠల్లో ఐఏఎఫ్‌ ఆకాశమంత ఎత్తులో ఉండాలని కోరుకుంటున్నా - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

* దేశ రక్షణలో వైమానిక దళం చూపిస్తున్న ధైర్యపరాక్రమాలు, అంకితభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం. శత్రుమూకల నుంచి భారత గగనతలాన్ని రక్షించడమేగాక.. ప్రకృతి విపత్తుల సమయంలోనూ మేమున్నామంటూ దేశ ప్రజలకు అండగా నిలుస్తున్నారు - ప్రధాని మోదీ

* వాయుసేన సిబ్బందికి వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు. కఠిన సవాళ్లను ఎదుర్కొంటూ శత్రువులను నిరోధిస్తున్న వైమానిక దళానికి యావత్‌ దేశం అభివాదం‌ చేస్తోంది. వారి సేవలను చూసి గర్వపడుతోంది - కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

* కీర్తి, విజయం ఎల్లప్పుడూ ఐఏఎఫ్‌ వెంటే.. ఆకాశమే హద్దుగా ముందుకు సాగండి - భారత ఆర్మీ

* వైమానిక దళ సిబ్బందికి ఎయిర్‌ఫోర్స్‌ డే శుభాకాంక్షలు. ఈ దేశ రక్షణ కోసం నిస్వార్థంగా, నిర్విరామంగా సేవలందిస్తున్న మీరు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం - మాజీ క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌ 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని