close

తాజా వార్తలు

Updated : 24/11/2020 17:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి దంపతులు

తిరుమల: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత తిరుమల చేరుకున్న రాష్ట్రపతికి పద్మావతీ అతిథి గృహం వద్ద తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. ఆలయ మహాద్వారం వద్ద రాష్ట్రపతి దంపతులకు అర్చకులు ఇస్లికఫాల్ (పూర్ణకుంభం)‌ స్వాగతం పలికారు. అనంతరం వరాహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీవారి దర్శనానికి వెళ్లారు. స్వామి వారి దర్శనం అనంతరం వేదపండితులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి శ్రీవారి చిత్రపటం, కేలండర్‌ను అందించారు. 

అంతకుముందు తిరుచానూరు పద్మావతీ అమ్మవారిని రాష్ట్రపతి దర్శించుకున్నారు. రాష్ట్రపతి వెంట గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఉన్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తిరుమల, తిరుపతిలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

 Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన