
తాజా వార్తలు
వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధంగా ఉన్నాం: కేసీఆర్
హైదరాబాద్: శాస్త్రీయంగా ఆమోదం పొందిన కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. అవసరమైన కార్యాచరణ రూపొందించినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక వాటిని ప్రజలకు అందించే విషయంలో అనుసరించాల్సిన విధానంపై సమావేశంలో చర్చించారు. ఈ అంశంపై కేసీఆర్ తన అభిప్రాయాలు వెల్లడించారు. వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని.. శాస్త్రీయంగా ఆమోదం పొందిన వ్యాక్సిన్ రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రజలకు వ్యాక్సిన్‌ను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వ్యాక్సిన్ వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా? లేదా? అన్న విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు వాతావరణ పరిస్థితులు ఉన్నాయని.. కరోనా వైరస్ కూడా దేశమంతా ఒకే రకమైన ప్రభావాన్ని చూపలేదన్నారు. ఈ కారణంగా వ్యాక్సిన్ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన దుష్ప్రభావాలను చూపే అవకాశం ఉందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. మొదట రాష్ట్రానికి కొన్ని చొప్పున వ్యాక్సిన్ డోసులు పంపి వాటిని కొంతమందికి ఇవ్వాలని.. ఆ తర్వాత 15 రోజులు పరిస్థితిని పరిశీలించి మిగతా వారికి ఇవ్వాలని సూచించారు.
ప్రధాని సమీక్ష అనంతరం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ ఇచ్చేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని, అందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్‌ను సరఫరా చేసేందుకు అవసరమైన కోల్డ్ చైన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్రం, జిల్లా, మండల స్థాయిలో కమిటీలుగా ఏర్పడి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందని సీఎం సూచించారు. మొదట ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, ఇతర శాఖల సిబ్బంది, 60ఏళ్ళు దాటిన వారికి, తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని తెలిపారు. ఇందుకోసం ప్రాధాన్యతా క్రమంలో జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- అమిత్ షాతో కీలక అంశాలు చర్చించిన జగన్
- రోజూ అనుకునేవాణ్ని.. ఇవాళ గెలిపించాను!
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- వీరే ‘గబ్బా’ర్ సింగ్‌లు..!
- కరోనా భయంతో.. అలా చేశాడట..!
- రహానె వ్యూహం.. కుర్రాళ్ల పోరాటం... అద్భుతం
- ‘కేరింత’ హీరోపై కేసు నమోదు
- పటాన్చెరులో ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆత్మహత్య
- మాటల్లో చెప్పలేను: రహానె
ఎక్కువ మంది చదివినవి (Most Read)
