close

తాజా వార్తలు

Published : 08/11/2020 16:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పెళ్లంటే భయపడ్డా: ప్రియాంక చోప్రా

లాస్‌ ఏంజెల్స్‌: బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా.. నిక్‌ జొనాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఒకానొక సమయంలో వివాహమంటే తాను ఎంతో భయపడ్డానని ఆమె వెల్లడించారు. అంతేకాకుండా నిక్‌ని చూశాక తన భయాలన్నీ పోయాయని, ఇప్పుడు జీవితం ఎంతో సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

‘వివాహబంధం.. ఈ ఆలోచనని చిన్నప్పుడు నేనంతగానో ఇష్టపడ్డాను. పెళ్లంటే ఏంటో తెలియని వయసులోనే పెళ్లికుమార్తెగా అలంకరించుకోవాలనుకునేదాన్ని. కానీ 20 యేళ్ల వయసు వచ్చేసరికి పెళ్లంటే నాకు భయం పట్టుకుంది. సరైన జీవిత భాగస్వామిని ఎంచుకుంటే జీవితం అంతా సవ్యంగా సాగుతుంది. లేకపోతే పెళ్లి తర్వాత ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ విధంగా వివాహబంధం గురించి ఎన్నో భయంకరమైన ఆలోచనలు ఆ సమయంలోనే నాలో ఉండేవి. కానీ నిక్‌ని కలిశాక.. తానే నా జీవితానికి సరైన జోడీ అని అర్థమైంది. అలా మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడి.. పెద్దలకు చెప్పి వివాహం చేసుకున్నాం. ఇప్పుడు నాకు వివాహబంధం అంటే ఎలాంటి భయం లేదు.’ అని ప్రియాంక చోప్రా వెల్లడించారు.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన