close

తాజా వార్తలు

Updated : 06/11/2020 14:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రియాంక ఫ్యాషన్‌ వెనుక కష్టాలు..!

‘ఆ రోజు ఊపిరి ఆడలేదు..

ముంబయి: భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న బ్యూటీ ప్రియాంకా చోప్రా. గత కొన్నేళ్లుగా ఆమె అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఎర్ర తివాచీపై మెరిశారు. ప్రత్యేకమైన లుక్‌, డిజైనింగ్‌ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. పలుమార్లు ఆమె ఫ్యాషన్‌, ఔట్‌ఫిట్‌ ఎంపికను మెచ్చుకుంటూ మీడియా కూడా కథనాలు రాసింది. అయితే అలా అందంగా కనిపించడం వెనుక ఎంతో కష్టం ఉందని ప్రియాంక చెప్పారు. పలు సందర్భాల్లో ధరించిన దుస్తుల వల్ల అసౌకర్యానికి గురయ్యానని వివరించారు.

తాజా ఇంటర్వ్యూలో ఈ మాజీ ప్రపంచ సుందరి చాలా అసౌకర్యంగా ఫీలైన ఔట్‌ఫిట్స్‌, ఆ సందర్భం గురించి ముచ్చటించారు. ‘2000లో నేను ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్నా. అప్పుడు నేను ధరించిన తెలుపు రంగు డ్రెస్‌ నా శరీరానికి తేలిగ్గా అతుక్కుని ఉంది. ఆ సమయంలో చిట్ట చివరికి నేను గెలిచా, డ్రెస్‌ వల్ల అప్పటికే చాలా ఇబ్బందిపడ్డా. నా డ్రెస్‌ టేప్‌ మొత్తం ఊడిపోవడం మొదలైంది. వేదికపై నడిచిన ప్రతిసారి నా చేతులతో ‘నమస్కారం’ పోజులో డ్రెస్‌ను పట్టుకునే ప్రయత్నం చేశా. ఇది తెలియక అందరూ నమస్కారం చేస్తున్నానని అనుకున్నారు. కానీ నిజానికి నా డ్రెస్‌ జారిపోకుండా అలా చేయాల్సి వచ్చింది’.

‘2018 మెట్‌ గాలా లుక్‌ వల్ల‌ కూడా బాగా ఇబ్బందిపడ్డా. గోల్డెన్‌ హుడ్‌ కల్గిన బ్లడ్‌ రెడ్‌ కలర్‌ ఔట్‌ఫిట్‌ ఎంతో అందంగా ఉంది.. కానీ దాన్ని ధరించిన తర్వాత నేను ఊపిరి పీల్చుకోలేకపోయా. ఆ బరువుకు నా ఎముకల ఆకారం మారిపోతుందేమే అనిపించింది. భోజనం చేయడం కోసం కూర్చోలేకపోయా. ఆ రోజు రాత్రి నేను సరిగా తినలేదు’ అని ప్రియాంక తన ఫ్యాషన్‌ వెనక కష్టాల్ని గుర్తు చేసుకున్నారు.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన