
తాజా వార్తలు
బర్త్డే కేక్ ఇలా కట్ చేయాలట!
ఇంటర్నెట్డెస్క్: మీ పుట్టిన రోజు అయితే ఏం చేస్తారు! స్నేహితులను, బంధువులను పిలిచి కేక్ కట్, స్నాక్స్ లేదా భోజనాలు పెడతారు. కానీ, ఇది కరోనా కాలం ఎవరినీ ఇంటికి పిలిచే పరిస్థితి లేదు. ఇలాంటప్పుడు పుట్టినరోజు వస్తే, అందులోనూ కేక్ కట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఇలా చేయమంటోంది అందాల తార తాప్సి. ఆగస్టు 1న ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఇంట్లోనే కేక్ కట్ చేసిన ఆమె అందుకు ఒక పద్ధతి ఉందని తెలిపింది. తాప్సి ఏం చెప్పిందంటే..
ఓ కోరిక కోరుకోండి.
బుద్ధిలేని వ్యక్తుల్లా వంద కోరికలు కోరుకోకుండా బలంగా ఒక్కటి మాత్రమే కోరండి.
ఓకే ఉదాహరణకు ‘గో కరోనా గో’.
ఇక కేక్ కట్ చేయడానికి సిద్ధకండి.. ఆగండాగండీ.. మొదట కొవ్వొతిని ఊదాలి. అంతకన్నా ముందు కత్తిని కుడివైపు కాస్త పక్కకు పెట్టండి.
ఇప్పుడు కొవ్వొత్తిని ఊదండి. ఎందుకంటే అదేమీ వయసును చెప్పదు.
చిత్రవధ చేసినట్లు కాకుండా చక్కగా కేక్ కట్ చేయండి.