close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 12/05/2020 23:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రెండు నెలల్లో ఆరు లక్షల కోట్ల రుణాలు

దిల్లీ: గడచిన రెండు నెలల కాలంలో సూక్ష్మ-చిన్న-మధ్య తరహా పరిశ్రమలు (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ), వ్యవసాయ, కార్పొరేట్ రంగాలలోని సంస్థలకు ప్రభుత్వ రంగ బ్యాంకు‌లు (పీఎస్‌బీ) సుమారు ఆరు లక్షల కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలానే మార్చి 1 నుంచి మే 8, 2020 మధ్య నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) ఈ బ్యాంకుల నుంచి రూ.1.18 లక్షల కోట్లు పొందాయని మంత్రి వెల్లడించారు. ‘‘ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ, రిటైల్, వ్యవసాయం, కార్పోరేట్ రంగాలకు చెందిన సుమారుగా 46.47 లక్షల ఖాతాలకు మార్చి 1 నుంచి మే8, 2020 మధ్య పీఎస్‌బీలు రూ.5.95 లక్షల కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేశాయి. రూ.1.18 లక్షల కోట్ల విలువైన ఫైనాన్స్‌ను ఎన్‌బీఎఫ్‌సీలకు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు అందించాయి’’ అని సీతారమన్ ట్విటర్లో తెలిపారు. 

మార్చి 25న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చిన్పటి నుంచి పీఎస్‌బీలు వర్కింగ్ క్యాపిటల్ పరిమితుల ఆధారంగా తమ వద్ద ఉన్న ఫండ్ నుంచి 10 శాతం అదనపు రుణ మంజూరుకు ముందుకు వచ్చాయి. మార్చి 20 నుంచి మే 8 మధ్య ఎమర్జెన్సీ లైన్‌ ఆఫ్ క్రెడిట్‌కు అర్హత ఉన్న 97 శాతం పరిశ్రమలు రుణాల కోసం పీఎస్‌బీలను సంప్రదించగా.... మూలధన అభివృద్ధి పనితీరు ఆధారంగా వాటికి రూ.65,879 కోట్ల విలువైన రుణాలు మంజూరు చేసినట్లు సీతారామన్‌ తెలిపారు. కరోనా నియంత్రణలో భాగంగా తొలి దశలో మార్చి 25న కేంద్రం 21 రోజుల లాక్‌డౌన్‌ విధించింది. అయితే వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉండటంతో దశల వారిగా లాక్‌డౌన్‌ పొడిగిస్తూ పలు రంగాలకు చెందిన పరిశ్రమలు తిరిగి ఉత్పత్తిని ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చింది. తాజాగా లాక్‌డౌన్‌ గడువు మే 17తో ముగియనున్న నేపథ్యంతో మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.   


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.