close

తాజా వార్తలు

Updated : 04/10/2020 20:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నపంజాబ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: యూఏఈలో జరుగుతున్న మెగా టీ20 క్రికెట్‌లో మూడు ఓటములతో కొట్టుమిట్టాడుతున్న పంజాబ్‌ మరికాసేపట్లో చెన్నైతో తలపడనుంది. దుబాయి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ధోనీసేనపై గెలుపొంది పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని పంజాబ్‌ పట్టుదలగా ఉంది. మరోవైపు ధోనీసేన సైతం ఈ సీజన్‌లో వరుసగా మూడు ఓటములతో సతమతమవుతోంది. ఈ జట్టు కూడా విజయంపైనే భారీ ఆశలు పెట్టుకుంది. దీంతో ఎవరు గెలుస్తారనే విషయంపై ఆసక్తి పెరిగింది. 

చెన్నై జట్టు: షేన్‌ వాట్సన్‌, అంబటిరాయుడు, డుప్లెసిస్‌, ధోనీ(కెప్టెన్‌), కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, డ్వేన్‌బ్రావో, సామ్‌కరన్‌, శార్దుల్‌ ఠాకుర్‌, పీయూష్‌ చావ్లా, దీపక్‌ చాహర్‌

పంజాబ్‌ జట్టు: మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్(కెప్టెన్‌)‌, మన్‌దీప్‌ సింగ్‌, నికోలస్‌ పూరన్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, క్రిస్‌ జోర్డాన్‌, హార్‌ప్రీత్‌ బ్రార్‌‌, రవి బిష్ణోయ్‌, షెల్డన్‌ కాట్రెల్‌, మహ్మద్‌ షమి 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.