సముద్రం ఎక్కడ కనపడినా కూర్చోండి: పూరి

తాజా వార్తలు

Published : 30/10/2020 18:17 IST

సముద్రం ఎక్కడ కనపడినా కూర్చోండి: పూరి

హైదరాబాద్‌: ఎలాంటి మనిషైనా సముద్రాన్ని చూస్తే, ఆనందపడతాడని అంటున్నారు మాస్‌ దర్శకుడు పూరి జగన్నాథ్‌. మన శరీరంలోనూ ఉన్నది ఉప్పునీరేనని, సముద్రం వద్దకు వెళ్లి నప్పుడు.. దానికి ఎదురుగా కూర్చొంటే తల్లీబిడ్డల్లా మన శరీరం, సముద్రం మాట్లాడుకుంటాయని అన్నారు. పూరి మ్యూజింగ్స్‌ పేరుతో వివిధ అంశాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సముద్రం గురించి ఆయన మాటల్లోనే..

‘‘సౌర కుటుంబంలో ఏ గ్రహానికి లేని ప్రత్యేకత భూమికి ఉంది. ఎందుకంటే ఇక్కడ సముద్రం ఉంది. నీరు లేకపోతే జీవితం లేదు. సైనో బ్యాక్టీరియా.. దీన్నే గ్రీన్‌ ఆల్వి అంటారు. అందరూ ఆ బ్యాక్టీరియా నుంచే వచ్చాం. ఈ భూమ్మీద ఉన్న ప్రతి జంతువు ఆ సముద్రానికి చెందినదే. అందులో 10 మిలియన్ల జీవరాసులు ఉన్నాయి. కొన్ని సముద్ర జీవులు మైక్రోస్కోప్‌లో చూస్తే కానీ కనపడవు. ఈ భూమ్మీద అతి పెద్ద జంతువు బ్లూవేల్‌ కూడా అందులోనే ఉంది. 70 శాతం ఆక్సిజన్‌ సముద్రం నుంచే వస్తుంది. ప్రపంచంలోని మ్యూజియంలలో ఉండే అరుదైన వస్తువుల కంటే సముద్రంలో ఎక్కువ అద్భుతాలు ఉన్నాయి. కొన్ని వేల ఓడలు, యుద్ధ నౌకలు, నగరాలు, పిరమిడ్‌లు, లాస్ట్‌ కింగ్‌డమ్‌ క్లియోపాత్ర, సమాధులు, క్రైస్ట్‌ ఆఫ్‌ స్టాచ్యూ, చైనీస్‌ అట్లాంటిస్‌, ఎవరెస్ట్‌ కంటే ఎత్తయిన కొండలు అక్కడ ఉన్నాయి. ఖండాలు విడిపోవడం వల్ల తల్లకిందులైన ప్రపంచం మొత్తం అందులోనే ఉంది’’

‘‘నీటికి జ్ఞాపకశక్తి ఉంది. ఒక గ్లాస్‌ నీటిలో గులాబీ పువ్వును ముంచి తీస్తే, ఆ గ్లాస్‌లోని ప్రతి నీటి బిందువులో గులాబీ పువ్వు రికార్డు అయి ఉంటుంది. ఒక నీటి బొట్టుకే ఇంత గుర్తు ఉంటే, ఒక సముద్రానికి ఇంకెంత గుర్తు ఉంటుంది. సముద్రం ఒక సాక్ష్యం. మన బ్రెయిన్‌లో 70శాతం నీరు ఉంది. అంటే మన జ్ఞాపకాలు కూడా నీటిలో నిక్షిప్తమై ఉన్నాయా? ఏమో! అందుకే సముద్రం ముందు కూర్చొంటే ఏదో బంధం ఉన్నట్లు భావిస్తాం. సముద్ర అలలు తగిలితే మన డీఎన్‌ఏ హ్యాపీగా ఫీలవుతుంది. దాని ముందు మంచోడు, దుర్మార్గుడు, సైకో‌, సైకో థెరపిస్ట్‌ అందరూ హ్యాపీగా ఫీలవుతారు. మీ అహం తగ్గిపోతుంది. సముద్రం నిన్ను ఒక కవిని చేస్తుంది. సముద్రం ఒడ్డున కూర్చొంటే మెడిటేషన్‌ వస్తుంది. అందుకే సముద్రం ఎక్కడ కనిపించినా కాసేపు కూర్చోండి. మన శరీరంలో ఉండేది కూడా ఉప్పునీరే. సముద్రం ఎదుట కూర్చొంటే తల్లీబిడ్డల్లా రెండూ మాట్లాడుకుంటాయి’’ అని చెప్పుకొచ్చారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని