close

తాజా వార్తలు

Published : 23/11/2020 00:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆర్‌బీఐ సరికొత్త రికార్డు

ముంబయి: భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బీఐ) సరికొత్త రికార్డు సృష్టించింది.  ప్రపంచలోనే అత్యధిక ట్విటర్‌ ఫాలోవర్లు ఉన్న కేంద్ర బ్యాంకుగా అవతరించింది.  ఆర్‌బీఐ అధికారిక ట్విటర్‌ ఖాతా ‘‘RBI Twitter’’ తాజాగా 10 లక్షల మంది ఫాలోవర్లను సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పేరెన్నికగన్న యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ 6.67 లక్షల ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలవగా..  యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు (ఈసీబీ) 5.91లక్షల మందితో మూడో స్థానంలో ఉంది. ఈ సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సహోద్యోగులను అభినందిస్తూ ట్వీట్ చేశారు. గత సెప్టెంబరు 27 నాటికి 9.66 లక్షల ఫాలోవర్లు ఉన్న ఆర్‌బీఐ ట్విటర్‌ హ్యాండిల్‌ తాజాగా 10లక్షల మైలురాయిని దాటింది.

యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ 2009 మార్చిలో ట్విటర్‌లో చేరగా.. ఈసీబీ 2009 అక్టోబర్‌లో చేరింది. అయితే గత 85 ఏళ్లుగా సేవలందిస్తున్న ఆర్‌బీఐ మాత్రం జనవరి 2012లో ట్విటర్‌ ఖాతా తెరిచింది. మొదట్లో ఈ ఖాతాను అనుసరించేవారు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ మార్చి 2019 నుంచి మార్చి 2020 మధ్య కాలంలో ఫాలోవర్ల సంఖ్య 3.42 లక్షల నుంచి 7.50 లక్షలకు చేరింది. కేవలం మార్చి 25 లాక్‌డౌన్‌ తర్వాత ఈ ఖాతాను అనుసరించే వారి సంఖ్య 1.5లక్షలకు పైగా పెరిగింది. తాజా ఆర్థిక సంవత్సరంలోనే 2.50 లక్షల మంది కొత్తగా ఈ ఖాతాకు చందాదారులుగా చేరారు.Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని