ఆర్‌బీఐ నిర్ణయాలతో పేదలకు ఎంతో మేలు
close

తాజా వార్తలు

Published : 17/04/2020 15:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్‌బీఐ నిర్ణయాలతో పేదలకు ఎంతో మేలు

దిల్లీ: ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి నేడు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) తీసుకున్న నిర్ణయాలు పేదలు, రైతులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అలాగే, ద్రవ్య లభ్యత, రుణ సరఫరా సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. ‘‘నేడు ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాల వల్ల ద్రవ్య లభ్యత, రుణ సరఫరా సామర్థ్యం పెరగనుంది. చిన్న స్థాయి పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలు, రైతులు, పేదలు ఎంతగానో లబ్ధిపొందనున్నారు. ‘వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌’(డబ్ల్యూఎంఏ) పరిమితి పెంపు వల్ల రాష్ట్రాలు కూడా ప్రయోజనం పొందనున్నాయి’’ అని మోదీ ట్వీట్‌ చేశారు.

కరోనా వైరస్‌ ప్రభావంతో కుంటుపడిన ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచేందుకు నేడు ఆర్‌బీఐ పలు కీలక ప్రకటనలు చేసింది. రాష్ట్రాల డబ్ల్యూఎంఏ పరిమితిని 60శాతానికి పెంపు, సూక్ష్మ ఆర్థిక సంస్థలకు రూ.50వేల కోట్లు, నాబార్డుకు రూ.25వేల కోట్లు వంటి కీలక నిర్ణయాలు నేటి ఆర్‌బీఐ ప్రకటనల్లో ఉన్నాయి.

ఇదీ చదవండి...

జీడీపీలో 3.2శాతం ద్రవ్యం అందుబాటులో: ఆర్‌బీఐ


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని