‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అప్‌డేట్‌ వచ్చేసింది!
close

తాజా వార్తలు

Updated : 06/10/2020 11:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అప్‌డేట్‌ వచ్చేసింది!

హైదరాబాద్‌: మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయడం ఇక మా వంతు అంటూ ప్రకటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం అందుకు తగ్గట్టుగానే అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చింది. ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్.ఎస్‌.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. కరోనా తర్వాత షూటింగ్‌ను ఎలా మొదలు పెట్టిందన్న విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక వీడియోను పంచుకుంది. ‘విశ్రాంతి.. పునరుత్తేజం.. ఉత్సాహంతో ముందుకు..’ అంటూ #WeRRRBack అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది. అంతేకాదు, ఎన్టీఆర్‌ అభిమానులకు సైతం తీపి కబురు చెప్పింది. అక్టోబరు 22న ‘రామరాజు ఫర్‌ భీమ్‌’ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కతోన్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న రామ్‌చరణ్‌కు జంటగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ నటించనుండగా... కొమరంభీమ్‌గా కనిపించనున్న ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌, హాలీవుడ్‌ నటీనటులు ఎలిసన్‌ డ్యూడీ, రేయ్‌ స్టీవ్‌సన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని