
తాజా వార్తలు
INPICS: RRR సర్ప్రైజ్ చూశారా
వైరల్‌గా మారిన ఫొటోలు
హైదరాబాద్: అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నుంచి దీపావళి స్పెషల్ సర్ప్రైజ్ వచ్చేసింది. పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. వెలుగుల పండుగ సందర్భంగా రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్ స్పెషల్ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విటర్ వేదికగా షేర్ చేసిన చిత్రబృందం.. ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ దీవాళి ప్రతిఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంది. చిత్రబృందం షేర్ చేసిన ఫొటోల్లో రాజమౌళి, ఎన్టీఆర్, చెర్రీ సరదాగా మాట్లాడుకుంటూ.. చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.
‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నుంచి అనుకోని విధంగా సర్ప్రైజ్ రావడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. లైకులు, షేర్స్‌తో తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది నెటిజన్లు.. ‘సూపర్ పిక్స్.. ఇంటర్వ్యూ ఏమైనా ఉందా?’ అంటూ కామెంట్లు పెట్టగా. అలాంటిది ఏమీ లేదని చిత్రబృందం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- స్వాగతం అదిరేలా..
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
- ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..
- డీఎం సాబ్.. నేను తేజస్వి మాట్లాడుతున్నా..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
