close

తాజా వార్తలు

Published : 05/08/2020 22:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దేశంలోనే తొలి మొబైల్‌ ఆర్టీపీసీఆర్‌ పరీక్ష కేంద్రం

బెంగళూరు: దేశంలోనే తొలి మొబైల్‌ ఆర్టీపీసీఆర్‌ పరీక్ష కేంద్రాన్ని బెంగళూరులో కర్ణాటక వైద్యవిద్యాశాఖ మంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌ ప్రారంభించారు. నేరుగా ప్రజల వద్దకే వెళ్లి కరోనా నమూనాలను సేకరించనున్నట్లు ఆయన తెలిపారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్ (ఐఐఎస్‌సీ) అభివృద్ధి చేసిన ఈ మొబైల్‌ పరీక్ష కేంద్రం ఐసీఎంఆర్‌ ఆమోదం పొందింది. ఈ కేంద్రం నెలకు 9వేల నమూనాలను విశ్లేషించనుంది. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజల నుంచి నమూనాలు తీసుకొని 4గంటల్లోనే ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ వాహనంలో కొవిడ్‌ పరీక్షలతో పాటు హెచ్‌1ఎన్‌1, హెచ్‌సీబీ, టీబీ, హెచ్‌పీడీ, హెచ్‌ఐవీ వంటి పరీక్షలను కూడా చేయనున్నట్లు అధికారులు తెలిపారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.