ఈ పజిల్‌ను విప్పుతారా!: రాహుల్ గాంధీ 
close

తాజా వార్తలు

Updated : 04/05/2020 14:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ పజిల్‌ను విప్పుతారా!: రాహుల్ గాంధీ 

దిల్లీ: వలస జీవులను స్వస్థలాలకు తరలించడానికి రైలు ఛార్జీలు వసూలు చేయడంపై కేంద్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు విరాళం ఇస్తూ, ఇంకోవైపు ఛార్జీలు వసూలు చేయడం ఏంటని రైల్వే శాఖపై మండిపడ్డారు. కరోనా వైరస్‌ విజృంభణతో విధించిన లాక్‌డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను ఆయా రాష్ట్రాల అనుమతితో రైళ్ల ద్వారా సొంత ప్రాంతాలకు తరలిస్తున్నారు.  

ఈ సందర్భంగా ఛార్జీలు వసూలు చేయడంపై రాహుల్ గాంధీ స్పందిస్తూ..‘దేశంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కార్మికులను సొంత ప్రాంతాలకు పంపించడానికి రైల్వే ఛార్జీలు వసూలు చేస్తుంది. మరోవైపు రైల్వే మంత్రిత్వ శాఖ పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ.151 కోట్లు రూపాయలు విరాళంగా అందించింది. ఈ పజిల్‌ను విప్పుతారా!’ అని రాహుల్ గాంధీ ట్విటర్‌ వేదికగా కేంద్రంపై విమర్శలు చేశారు. అయితే కొన్ని ప్రభుత్వ వర్గాలు మాత్రం టికెట్ ధర మీద 85 శాతం సబ్సిడీ ఇచ్చినట్లు వెల్లడించాయి. మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పాయి. సామాజిక దూరాన్ని పాటించాలనే లక్ష్యంతో రైళ్ల  సామర్థ్యంలో సగం ఖాళీగానే ఉంటుందని, సిబ్బంది రక్షణ భారాన్ని కేంద్రమే భరిస్తుందని తెలిపాయి. వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు అయ్యే రైల్వే వ్యయాన్ని తాము భరిస్తామని ఇప్పటికే కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీ తెలిపారు. Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని