
తాజా వార్తలు
జవాబులు కావాలి..
వాక్సిన్‌పై ప్రజలకున్న సందేహాలు తీర్చాలి
ప్రధానికి ప్రశ్నలు సంధించిన రాహుల్
దిల్లీ: ప్రజలకు కరోనా వాక్సిన్ పంపిణీపై ఉన్న సందేహాలను కేంద్ర ప్రభుత్వం తీర్చాలని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. సోమవారం ఈ మేరకు కేంద్రానికి నాలుగు ప్రశ్నలు సంధించారు. దేశ ప్రజలందరి మదిలో ఉన్న ఈ ప్రశ్నలకు ప్రధాని సమాధానం ఇచ్చితీరాలన్నారు. ఈ మేరకు ట్విటర్లో ప్రశ్నలు కురిపించారు. ఆ ప్రశ్నలు ఏంటంటే..
1. వాక్సిన్ వచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందా?? నిర్ణయిస్తే ఎందుకు వారినే ఎంచుకుంటారు??
2. వాక్సిన్ ముందుగా ఎవరికి ఇస్తారు? అసలు పంపిణీ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతోంది?
3. పీఎం కేర్స్ నిధులను ఉపయోగించి ప్రజలందరికీ వాక్సిన్ ఉచితంగా అందిస్తారా??
4. వాక్సిన్ను దేశప్రజలందరికీ ఎప్పటిలోగా అందిస్తారు??
ముందు జాగ్రత్త లేకుండా కేంద్రం లాక్‌డౌన్‌ను విధించడంతో అనేక మంది ఆకలితో అలమటించారని రాహుల్ ఆదివారం ట్వీట్ చేశారు. మంగళవారం ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో రాహుల్ అడిగిన ఈ ప్రశ్నలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
- ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
