close

తాజా వార్తలు

Published : 22/12/2020 20:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అరెస్టుపై రైనా  ఏమన్నాడంటే?

ముంబయి: పోలీసులు అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేసిన ఘటనపై టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ సురేశ్‌రైనా విచారం వ్యక్తం చేశాడు. ఉద్దేశపూర్వకంగా తాను నిబంధనలు ఉల్లంఘించలేదని తెలిపాడు. అలా జరగడం దురదృష్టకరమని పేర్కొన్నాడు. ముంబయి నగరంలోని నిబంధనలు, సమయం గురించి తనకు అవగాహనలేదని వెల్లడించాడు. ఈ మేరకు అతడి మేనేజ్‌మెంట్‌ బృందం ఓ ప్రకటన విడుదల చేసింది.

ముంబయి విమానాశ్రయం సమీపంలోని ఓ పబ్‌లో సింగర్‌తో పాటు రైనాను పోలీసులు అరెస్టు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి ఎక్కువసేపు పబ్‌ నిర్వహించడం, కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు రైనా సహా 34 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మహిళలకు నోటీసులు జారీచేసి విడిచిపెట్టగా పురుషులను బెయిల్‌పై విడుదల చేశారు. బాలీవుడ్‌ సెలెబ్రిటి సుసాన్‌ ఖాన్‌ సైతం అరెస్టైన వారిలో ఉన్నారు.

‘సురేశ్‌ రైనా షూటింగ్‌ కోసం ముంబయికి వచ్చారు. షూటింగ్‌ ఆలస్యం కావడంతో మిత్రుడి ఆహ్వానం మేరకు త్వరగా డిన్నర్‌ చేసేందుకు వెళ్లారు. ఆ తర్వాత దిల్లీకి ప్రయాణం చేయాల్సింది. కానీ ఆయనకు స్థానిక నిబంధనలు, సమయం గురించి అవగాహన లేదు. ఈ సంగతి తెలియగానే ఆయన అధికారుల వద్దకు వెళ్లి విచారం వ్యక్తం చేశారు. ఇలా జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. స్థానిక సంస్థలు, ప్రభుత్వాలు పెట్టిన నిబంధనలను ఆయన తూచా తప్పకుండా పాటిస్తారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటారు’ అని ఆ ప్రకటనలో తెలిపారు.

ఇవీ చదవండి
2020.. కోహ్లీ ఏంటి?
క్రికెటర్‌ సురేశ్ రైనా అరెస్టు

 



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని