
తాజా వార్తలు
సచిన్ పైలట్ పిటిషన్: విచారణ వాయిదా!
సవరణ పిటిషన్‌కు సమయాన్ని కోరిన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు
రేపటివరకు గడువు ఇచ్చిన రాజస్థాన్ హైకోర్టు
జైపూర్: రాజస్థాన్ స్పీకర్ నోటీసులను సవాలు చేస్తూ రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఆరాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ సమయంలో సవరణతో కూడిన పిటిషన్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని సచిన్‌పైలట్‌తోపాటు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు హైకోర్టును కోరారు. వారి విన్నపాన్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు, రేపటిలోగా సవరణతోకూడిన తాజా పిటిషన్ దాఖలు చేయాలని వారికి సూచించింది. ఈ కేసును హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టగా, తాజా పిటిషన్ దాఖలు చేసిన అనంతరం తిరిగి విచారణ చేపడతామని పేర్కొంది.
ఇక, విప్‌ను ధిక్కరించి పార్టీ శాసనసభాపక్ష(సీఎల్పీ) సమావేశాలకు హాజరు కానందుకు వారి సభ్యత్వాలను రద్దు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ స్పీకర్ ద్వారా రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇప్పించింది. కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ ఫిర్యాదు మేరకు రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి నిన్న 19మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేశారు. దీనిపై శుక్రవారంలోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. స్పీకర్ నోటీసులను సవాల్‌చేస్తూ సచిన్ పైలట్‌తోపాటు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు రాజస్థాన్ హైకోర్టులను ఆశ్రయించారు.