
తాజా వార్తలు
జనవరిలో రజనీ రాజకీయ అరంగేట్రం
చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. తమిళనాట ప్రజలు, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తలైవా రాక ఖరారైంది. వచ్చే ఏడాది జనవరిలో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా రజనీ ప్రకటించారు. జనవరిలో రాజకీయ పార్టీ ప్రారంభిస్తానని, అందుకు సంబంధించిన వివరాలను డిసెంబరు 31న ప్రకటిస్తానని వెల్లడించారు. ‘‘త్వరలో జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ప్రజల ఆదరణతో గెలిచి రాష్ట్రంలో నిజాయితీ, న్యాయమైన, కులమతాలకు అతీతమైన అధ్యాత్మిక రాజకీయాలకు నాంది పలకడం నిశ్చయం. అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతాయి. మారుస్తాం.. అన్నింటినీ మారుస్తాం. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ జరగదు’’ అని రజనీకాంత్ ట్విటర్లో పేర్కొన్నారు.
రజనీ మక్కళ్ మండ్రం నిర్వాహకులతో భేటీ అయిన కొద్ది రోజులకే రజనీ ఈ ప్రకటన చేశారు. గత సోమవారం రజనీ మక్కళ్ మండ్రం జిల్లా కార్యదర్శులతో రజనీ సమావేశమైన విషయం తెలిసిందే. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో వీలైనంత త్వరగా పార్టీని స్థాపించాలని కార్యదర్శులు రజనీని కోరారు. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన తలైవా.. రాజకీయ ప్రవేశంపై వీలైనంత త్వరగా నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. అన్నట్లుగానే ఈరోజు కీలక ప్రకటన చేశారు. రజనీ రాకపై స్పష్టత రావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నప్పటికీ గత నెల సోషల్‌మీడియాలో వైరల్ అయిన ఓ లేఖ అభిమానుల గుండెల్లో గుబులు పుట్టించింది. ఆరోగ్య కారణాల దృష్ట్యా రజనీ తన రాజకీయ ఆలోచన విరమించుకోవాలని వైద్యులు సూచించినట్లు ఆ లేఖలో ఉంది. డయాలసిస్ పేషెంట్ అయిన రజనీకాంత్ ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో బయట తిరగడం ఆమోదయోగ్యం కాదని డాక్టర్లు చెప్పినట్లుగా ఉన్న లేఖ వైరల్ కావడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ లేఖపై స్పందించిన రజనీ.. అది తాను రాసింది కాదని ప్రకటించారు. కానీ ఆ లేఖలో ఉన్న ఆరోగ్య సమాచారం నిజమేనన్నారు. అయితే సరైన సమయంలో రాజకీయ ప్రవేశంపై నిర్ణయం తీసుకుంటానని భరోసానివ్వడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.
ఈ నేపథ్యంలోనే గత సోమవారం రజనీ మక్కళ్ మండ్రం నిర్వాహకులను కలిసిన తలైవా.. రాజకీయ ప్రవేశంపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ పెడితే చోటుచేసుకునే పరిణామాలు, లోటుపాట్లను తెలుసుకున్నారు. అన్నీ పరిశీలించిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది జనవరిలో పార్టీ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రజనీ పార్టీ సంచలన పరిణామాలకు కారణమయ్యే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి తలైవా రాకతో ఏమేరకు అద్భుతం జరగనుందో.. వేచి చూడాల్సిందే!
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- భారత్ చిరస్మరణీయ విజయం..
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- గుడివాడ రెండో పట్టణ ఎస్సై ఆత్మహత్య
- భారత్ vs ఆస్ట్రేలియా: కొత్త రికార్డులు
- ఆసీస్ పొగరుకు, గర్వానికి ఓటమిది
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
