close
Array ( ) 1

తాజా వార్తలు

పసిబుగ్గపై కర్కశ కాటు!

నాలుగేళ్ల చిన్నారిపై ఘాతుకం

పోలీసుల అదుపులో నిందితుడు

చిరునవ్వుల బాల్యం.. ఆటపాటలే సర్వం.. అమ్మనాన్నే సర్వస్వం.. ముద్దుమురిపాలే నిత్యం.. తియ్యనైన పలకరింపు.. నేనున్నానని లాలింపు.. ఆటపాటల రంగరింపు.. మాటలతో మైమరపు..కనురెప్ప నీడన కల్మషం కదలికల మాటున కర్కశం.. ఆప్యాయత నీడన అసురత్వం అణువణువునా దాగిన క్రూరత్వం.. ఎవరూ లేని వేళకై మాటేశాడు.. అదను చూసి మృగంలా మారాడు..పసిబుగ్గలను నిర్దయగా చిదిమాడు.. మానవత్వం వీడి కర్కశంగా కాటేశాడు..
(అనంతపురంలోని మహాత్మాగాంధీ కాలనీలో నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు దారుణానికి ఒడిగట్టిన ఘాతుకమిది.)

అనంత నేరవార్తలు: మానవత్వం సైతం చెమ్మగిల్లే దయనీయ ఘటన జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత వర్గాల వివరాల మేరకు... అనంతపురంలోని మహాత్మాగాంధీ కాలనీకి చెందిన దంపతులకు నలుగురు పిల్లలు. వీరిద్దరూ పొద్దంతా శ్రమించి రాత్రికి ఇంటికి చేరుకుంటారు. తల్లి రాత్రి 10 గంటలకు పని ముగించుకొని ఇంటికి వస్తుంది. తండ్రి 10 గంటల తర్వాతనే ఇంటికి వస్తాడు. ఇంటి వద్ద పిల్లలతోపాటు తాత ఉంటున్నాడు. బుధవారం రాత్రి అమ్మమ్మ బయటకు వెళ్లింది. మిగతా పిల్లలు బాబాయి ఇంటి వద్దకు వెళ్లడంతో.. నాలుగేళ్ల వయస్సున్న వీరి రెండో కుమార్తె ఇంటిలోనే ఉంది. అదే కాలనీలో నివాసం ఉంటున్న కామాంధుడు కిరణ్‌(40) చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

నిందితుడి నేపథ్యం...

కంబదూరు మండలం అండేపల్లికి చెందిన కంజిగప్ప కరియన్న అలియాస్‌ కిరణ్‌ గతంలో లాడ్జిలో బాయ్‌గా పని చేసేవాడు. మరికొంత కాలం హోటల్‌లో సర్వర్‌గా పని చేశాడు. ప్రస్తుతం కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతడికి భార్య, పిల్లలు ఉన్నారు. నిందితుడు తరచూ చిన్నారి ఇంటికి వస్తూ పలకరిస్తూ వెళ్లేవాడు. తినుబండారాలు కొనివ్వడం చేస్తుండేవాడు. దీంతో తన మాటలతో చిన్నారిని బాగా మచ్చిక చేసుకున్నాడు. ఈనెల 3న బుధవారం కూడా రాత్రి 7 గంటల తర్వాత చిన్నారి ఇంటికి వచ్చాడు. బిస్కెట్లు తెచ్చుకుంటావా అంటూ అడిగాడు. అనంతరం చిన్నారిపై ఘాతుకానికి పాల్పడ్డాడు.

తొలుత ఆర్‌ఎంపీ వద్దకు..

అఘాయిత్యం జరిగిన తర్వాత చిన్నారి ఇంటిలో ఏడుస్తూ కుప్పకూలింది. ఈ విషయాన్ని అమ్మమ్మ గుర్తించి ఏం జరిగిందో తెలుసుకుని ఇరుగుపొరుగును పిలిచేలోపు నిందితుడు పారిపోయాడు. ఈలోగా తల్లిదండ్రులు ఇంటికి చేరుకున్నారు. బాలికను తొలుత ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. తీవ్ర రక్తస్రావం జరుగుతుండటంతో ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలనీ, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. దీంతో బాధితులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత మూడో పట్టణ పోలీసులకు విషయం తెలిపారు. మూడో పట్టణ సీఐ బాలమద్దిలేటి విచారించి నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఉరితీయాల్సిందే...

బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు కిరణ్‌ను అరెస్టు చేశామని సీఐ బాలమద్దిలేటి తెలిపారు. నిందితుడు గురువారం గుత్తి రోడ్డులో తిరుగుతుండగా అరెస్టు చేశామనీ.. కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై నగరంలో మహిళా సంఘాలు కన్నెర్ర చేశాయి. నిందితుడికి ఉరి శిక్ష విధించాలని డిమాండ్‌ చేశాయి. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడటానికి దుర్మార్గుడికి చేతులెలా వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలోనూ విషాదం నెలకొంది. ఇలాంటి దుర్మార్గుడిని కాలనీలో ఉండనివ్వొదని స్థానికులు ఆగ్రహించారు. నిందితుడికి ఉరి శిక్ష వేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు.

పలువురి పరామర్శ

అనంతపురంలోని సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న చిన్నారిని ఐసీడీఎస్‌ పీడీ చిన్మయాదేవి, సీడబ్ల్యూసీ ఛైర్‌పర్సన్‌ నల్లాని రాజేశ్వరి తదితరులు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.