close
Array ( ) 1

తాజా వార్తలు

బాయ్‌ఫ్రెండ్‌పై రష్మీ ఆసక్తికర వ్యాఖ్యలు

అతను నన్ను ఎమోషనల్‌గా వాడుకున్నాడు

ముంబయి: తన మాజీ ప్రియుడు అర్హాన్‌ఖాన్‌ తనని ఎమోషనల్‌గా వాడుకున్నాడని అంటున్నారు నటి రష్మీ. ఇటీవల హిందీలో ప్రసారమైన ‘బిగ్‌బాస్‌ సీజన్‌13’లో పాల్గొని ఫైనల్‌ వరకూ చేరుకున్న రష్మీ దేశాయ్‌.. ఆ షో తర్వాత తాను ప్రేమించిన అర్హాన్‌ఖాన్‌ నుంచి విడిపోయారు. ఈ నేపథ్యంలో ఆమెను తాజాగా ఓ ఆంగ్ల పత్రికవారు ఇంటర్వ్యూ చేశారు. ఇందులో భాగంగా రష్మీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘అర్హాన్‌ఖాన్‌ కోసమే నేను కూడా ‘బిగ్‌బాస్‌’ షోలో పాల్గొన్నాను. అయితే ఆ షోలో ఉన్నప్పుడు తను నా గురించి ఎన్నో వ్యాఖ్యలు చేశాడు. నేను ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తరుణంలో తను నాకు పరిచయమయ్యాడని, నాకు సంబంధించిన అన్నీ విషయాలను తనే చూసుకున్నాడని అర్హాన్‌ ‘బిగ్‌బాస్‌’లో చెప్పాడు. అవి వింటే నాకు నవ్వు వచ్చింది. నిజం చెప్పాలంటే ఒకానొక సమయంలో నేను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాను. కానీ, తన జాలి, దయ మీద నేను బతకలేదు. కొన్ని విషయాల్లో అతనికే నేను ఆసరాగా నిలిచాను. అంతేకాకుండా ఆ షోలో భాగంగా అర్హాన్‌ గురించి ఎన్నో నమ్మలేని నిజాలు తెలుసుకున్నాను. తనకి అంతకు ముందే పెళ్లి జరిగిందని.. పిల్లలు కూడా ఉన్నారని, ముంబయిలో తనకి రెండు ఇళ్లు కూడా ఉన్నయని తెలిశాయి. అతను ఆ షో నుంచి వైదొలగినప్పటి నుంచి నేటి వరకూ తన గురించి ఎలాంటి ఆరోపణలు నేను చేయలేదు. ఎందుకంటే నా జీవితంలో అతను ముగిసిన అధ్యాయం’ అని రష్మీ పేర్కొన్నారు.

ఆ రియాల్టీ షో అయిపోయాక అర్హాన్‌ మిమ్మల్ని కలవడానికి ప్రయత్నించలేదా? అని విలేకరి ప్రశ్నించగా.. ‘అతను నాకు చాలాసార్లు మెసేజ్‌లు పెట్టాడు. నాకు కూడా తన నుంచి కొన్ని సమాధానాలు రావాలి. కాబట్టి తప్పకుండా అతన్ని కలుస్తాను. అతను నన్ను ఎమోషనల్‌గా వాడుకున్నాడనిపిస్తోంది’ అని రష్మీ వివరించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.