close

తాజా వార్తలు

Updated : 23/11/2020 14:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఖాళీ సమయం.. ఖన్నా సొంతం

ఫొటోషూట్లతో కనువిందు చేస్తున్న హీరోయిన్‌ రాశీఖన్నా

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి ప్రభావంతో సినిమా ఇండస్ట్రీలో చిత్రీకరణలకు బ్రేక్‌ పడింది. లాక్‌డౌన్‌ సమయంలో కొంతమంది నటులు వంటింటి పనుల్లో సాయం చేయగా.. ఇంకొంతమంది తమ శరీరాకృతిని మెరుగుపరుచుకునే పనిలో పడ్డారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోరకంగా లాక్‌డౌన్‌ను పూర్తి చేసుకున్నారు. అయితే.. ఇటీవల సినిమా చిత్రీకరణ చేసుకోవచ్చని ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు షూటింగ్‌ను షురూ చేశాయి. ఇంకొన్ని సినిమాలు మాత్రం వచ్చే ఏడాదిలో పనులు ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇలా ఉండగా.. దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డారు హీరోయిన్లు. వీలుచిక్కినప్పుడల్లా హాట్‌హాట్‌గా ఫొటో షూట్లు చేస్తూ అభిమానుల కళ్లలో మెరుస్తూనే ఉన్నారు. ఎంజిల్‌ ఆర్నా.. రాశీఖన్నా సైతం క్రమంతప్పకుండా సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పంచుకుంటూ అభిమానులకు కనువిందు కలిగిస్తోంది.
 

* అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగుతెరకు పరిచయమైందీ దిల్లీ ముద్దుగుమ్మ.


* సాయితేజ్‌ హీరోగా వచ్చిన ‘ప్రతి రోజూ పండగే’ సినిమాలో ఆమె ఎంజిల్‌ ఆర్నగా ప్రేక్షకులను అలరించింది.


* ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమాలో విజయ్‌ దేవరకొండతోనూ రొమాన్స్‌ చేసింది. 


* లాక్‌డౌన్‌ సమయంలో తెలుగు, తమిళ భాషలు నేర్చుకుందట. 


* ఆమె మొదటి సినిమా ‘మద్రాస్‌ కేఫ్‌’. 2013లో వచ్చిన ఈ హిందీ సినిమాలో ఆమె నటించింది. 


* ఏడేళ్ల సినీ కెరీర్‌లో ఆమె ఇప్పటికి తెలుగు, తమిళ భాషల్లో మొత్తం 22 సినిమాల్లో నటించింది. అందులో ఒక హిందీ, ఒక మలయాళం చిత్రం కూడా ఉన్నాయి.


* సుప్రీమ్‌ సినిమాలో బెల్లం శ్రీదేవీగా అందర్నీ అలరించింది.


* రాశీఖన్నా 1990 నవంబర్‌ 30న దిల్లీలో జన్మించింది. బీఏ చదివింది. చిన్నప్పుడు ఐఏఎస్‌ కావాలని అనుకునేదట. 


* ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు తమిళ సినిమాలతో బిజీగా ఉందట.


* నటిగా మనకు తెలిసిన రాశీ మంచి గాయని కూడా..


* ‘ప్రతి రోజూ పండగే’లో ‘యూ ఆర్‌ మై హై’ పాట పాడింది రాశీనే.


Tags :

సినిమా

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని