close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120020165 [video_srlno] => 1 [video_type] => 5 [video_link] => B8alfqknjpQ [video_short_link] => B8alfqknjpQ [created_by] => [created_date] => [modified_by] => 8923881 [modified_date] => 2020-02-11 18:17:03.167173 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 11/02/2020 18:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అద్భుతమైన కుటుంబం లభించింది..

1 మిలియన్‌కు చేరుకున్న రతన్ టాటా ఫాలోవర్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత అక్టోబర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రవేశించిన రతన్‌ టాటా పారిశ్రామిక రంగంలోనే కాకుండా నెట్టింట కూడా తను లెజెండ్‌ అని నిరూపించుకున్నారు. ఈ టాటా గ్రూపు మాజీ చైర్మన్‌ తన పెంపుడు శునకాల ఫోటోలు మొదలుకొని, తను యువకుడిగా ఉన్నప్పటి వరకు చక్కటి ఫోటోలను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేసారు. ఈ విధంగా సోషల్‌ మీడియా ద్వారా నెటిజన్లను ఆకట్టుకోవటంలో, అలరించటంలో ఆయన ఆరితేరిపోయారు... కేవలం నాలుగు నెలల్లోనే ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య ఒక మిలియన్‌ (పది లక్షల) మార్కును చేరుకోవటమే ఇందుకు నిదర్శనం. ఈ సందర్భంగా రతన్‌ టాటా తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ...తన సంతోషాన్ని తన చిత్రమే ఉన్న మరో పోస్ట్‌ ద్వారా ప్రకటించారు. 

ఈ చిత్రంలో రతన్‌ టాటా సింపుల్‌గా ఫ్యాంటు, షర్టు ధరించి...నేలమీద  కూర్చుని హాయిగా నవ్వుతూ ఉంటారు. ఆపైన ఆ పోస్టుకు ‘‘నా పేజ్‌కు ఉన్న ఫాలోవర్లు ఒక మైలురాయిని తాకటం ఇప్పుడే గమనించాను. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చేరినప్పుడు నాకు ఇంత అద్భుతమైన కుటుంబం లభిస్తుందని నేను అనుకోలేదు. ఈ ఇంటర్‌నెట్‌ యుగంలో మనం ఇంత విలువైన సంబంధాలు ఏర్పరచుకోవటం అనేది గొప్ప విషయం. మీలో భాగమై మీనుంచి అనేక విషయాలను నేర్చుకోవటం నిజంగా చాలా ఉత్సాహకరంగా, సంతోషంగా ఉంది... మీతో కలసి ఈ ప్రయాణం కొనసాగుతుందని ఆశిస్తున్నాను...’’ అనే వ్యాఖ్యను జోడించారు.

ఇక రతన్‌ టాటా పెట్టిన ఈ పోస్టు విపరీతంగా వైరల్ అయ్యింది. కేవలం నాలుగు గంటల్లోనే మూడున్నర లక్షల మంది ఈ పోస్టును లైక్‌ చేశారు. దేశంలో ఉన్న అత్యంత ఆకర్షణీయ వ్యక్తుల్లో మీరొకరు అంటూ ... ఈ పారిశ్రామిక దిగ్గజానికి హృదయపూర్వక అభినందనల వర్షం కురిపించారు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.