close

తాజా వార్తలు

Published : 13/11/2020 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాంటింగ్‌ సై అంటే సై అంటాడు తెలుసుగా!

కోహ్లీతో రికీ వాగ్వాదంపై అశ్విన్‌ స్పష్టత..

ఇంటర్నెట్‌డెస్క్‌: అబుదాబి వేదికగా బెంగళూరు, దిల్లీ జట్లు లీగ్‌ దశలో రెండోసారి తలపడిన సందర్భంగా విరాట్‌ కోహ్లీ, రికీ పాంటింగ్‌ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో అసలేం జరిగిందనే విషయంపై దిల్లీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తాజాగా స్పష్టతనిచ్చాడు. బుధవారం తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ ఇలా పేర్కొన్నాడు. ‘ఆరోజు మ్యాచ్‌ ఆడేటప్పుడు నా వెన్నెముకలో నొప్పిగా అనిపించింది. అప్పటికే ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయడంతో గాయమైందని తేలింది. నాలుగు ఓవర్లు బౌలింగ్‌ పూర్తి చేశాక డ్రెస్సింగ్‌రూమ్‌ లోకి వెళ్లాను. దాంతో బెంగళూరు టీమ్‌ ఏమనుకుందంటే.. నేను నాలుగు ఓవర్లు వేశాక వెళ్లిపోయానని అనుకున్నారు. అలా ఎలా చేస్తారని అడిగారు. అయితే, పాంటింగ్‌ గురించి మనందరికీ తెలిసిందే. అతడు సై అంటే సై అంటాడు. అస్సలు వెనక్కి తగ్గడు. ఇక బెంగళూరు అలా అడిగేసరికి మేమలా మోసం చేయట్లేదు. గాయం కారణంగా నొప్పి రావడంతోనే వెళ్లిపోయానని చెప్పాడు’ అని అశ్విన్‌ వివరించాడు. 

కాగా, ప్లేఆఫ్స్‌లో రెండో స్థానంలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దిల్లీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(29)ని అశ్విన్‌ ఔట్‌చేశాడు. అనంతరం దిల్లీ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దాంతో శ్రేయస్‌ టీమ్‌ ప్లేఆఫ్స్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఇక కోహ్లీని ఔట్‌ చేయడంపై స్పందించిన అశ్విన్‌.. తానెప్పటికీ బెంగళూరు సారథికి బౌలింగ్‌ చేయడం ఇష్టపడతానని చెప్పాడు. తనపై ఆధిపత్యం చెలాయించడానికి విరాట్‌ అవకాశాలు తీసుకోడని, తన వికెట్‌ ఇవ్వడానికి ఇష్టపడడని పేర్కొన్నాడు. అదొక గర్వకారణమైన విషయమని తెలిపాడు. ధోనీ కూడా అలాగే భావిస్తాడన్నాడు. 



Tags :

స్పోర్ట్స్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని