
తాజా వార్తలు
రీకౌంటింగ్‌లోనూ విజయం భాజపాదే
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటి వరకు తెరాస 54, భాజపా 44, ఎంఐఎం 43 స్థానాల్లో విజయం సాధించాయి. మిగతా స్థానాల్లోనూ లెక్కింపు చివరి దశకు చేరుకుంది. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్లో తొలుత తెరాస అభ్యర్థి లక్ష్మీప్రస్ననపై కేవలం 10 ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థి లచ్చిరెడ్డి విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీనిపై తెరాస అభ్యర్థి అనుమానం వ్యక్తం చేశారు. ఆమె రీకౌంటింగ్‌కు పట్టుబట్టడంతో ఎన్నికల అధికారులు అంగీకరించి రీకౌంటింగ్ నిర్వహించారు. అయినప్పటికీ విజయం భాజపానే వరించింది. రీకౌంటింగ్‌లో 32 ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థి గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
Tags :
రాజకీయం
జిల్లా వార్తలు