యోగీజీ.. ఇకనైనా తప్పు దిద్దుకోండి
close

తాజా వార్తలు

Published : 07/10/2020 02:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యోగీజీ.. ఇకనైనా తప్పు దిద్దుకోండి

యూపీ ప్రభుత్వానికి మాయావతి సూచన

లఖ్‌నవూ: హాథ్రస్‌ హత్యాచార ఘటనలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికైనా తమ తప్పు సరిదిద్దుకొని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి సూచించారు. లేదంటే రాష్ట్రంలో ఇలాంటి దారుణాలను అరికట్టలేమని అన్నారు. 

హాథ్రస్‌ ఘటనపై ప్రతిపక్షాలు కావాలనే కుట్ర చేస్తున్నాయంటూ యూపీ ప్రభుత్వం చేసిన ఆరోపణలపై మాయావతి దీటుగా స్పందించారు. ఇది భాజపా ‘ఎన్నికల ట్రిక్‌’ అని దుయ్యబట్టారు. ‘హాథ్రస్‌ ఘటనను ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో కుల, మత ఘర్షణలు సృష్టించేందుకు, అభివృద్ధికి ఆటంకం కలిగించేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలు నిజమైనవా? లేదా భాజపా ఎన్నికల ట్రిక్‌లో భాగమా? అనేది కాలమే చెబుతుంది. కానీ ఇప్పుడు మాత్రం యోగి ప్రభుత్వం బాధిత కుటుంబానికి న్యాయం జరిగే అంశంపై దృష్టి పెడితే బాగుంటుంది. హాథ్రస్‌ ఘటనలో బాధిత కుటుంబం పట్ల పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై యావత్‌ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం తమ తప్పును సరిదిద్దుకుని ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. లేదంటే ఇలాంటి అకృత్యాలను ఆపడం కష్టంగా మారుతుంది’ అని మాయావతి ట్విటర్‌ వేదికగా ధ్వజమెత్తారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని