రిలయన్స్‌ ‘ఫ్యూచర్‌’ ప్లాన్‌..!
close

తాజా వార్తలు

Published : 01/07/2020 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రిలయన్స్‌ ‘ఫ్యూచర్‌’ ప్లాన్‌..!

 రిటైల్‌ దిగ్గజాన్ని కొనేందుకు ముఖేశ్‌ యత్నం

బెంగళూరు: దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ మరో భారీ ప్రణాళిక అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రీటైల్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది.  ఈ డీల్‌ కనుక పూర్తి అయితే రిలయన్స్‌ భారత్‌లోని నిత్యావసరాలు, దుస్తుల రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకొంటుంది. ఈ డీల్‌లో బియానీ కుటుంబం ప్రమోట్‌ రిటైల్‌, లైఫ్‌స్టైల్‌, ఫ్యూచర్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌ విలీనానికి అవకాశం ఉంది.  ఈ మొత్తం వ్యాపారాన్ని అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ దక్కించుకోవచ్చు. 
 ప్రస్తుతం ఈ డీల్‌కు సంబంధించిన నిర్ణయాలు అడ్వాన్స్‌ దశలోకి చేరాయి. అన్ని సానుకూలంగా జరిగితే జులై15 రిలయన్స్‌ వార్షిక సమావేశం నాటికి డీల్‌ముగిసే అవకాశం ఉంది.  తుదిసంతకాలు కావాల్సి ఉన్నట్లు సమాచారం.  ఇరు పక్షాలు డీల్‌కు సంబంధించిన ఎటువంటి అంశాలను బయటకు రానీయడంలేదు. 

ఈ ఏడాది ప్రారంభంలో బియానీలకు చెందిన ఓ సంస్థ రుణ చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఈ డీల్‌ దిశగా అడుగులు పడినట్లు సమాచారం.  అప్పట్లో అమెరికాకు చెందిన అమెజాన్‌ గ్రూప్‌ కూడా దీనిలో వాటా కొనుగోలుకు ఆసక్తి చూపింది. కానీ, బియానీల రుణ పరిష్కారానికి అంబానీలు ఇచ్చిన ఆఫర్‌ మెరుగ్గా ఉన్నట్లు సమాచారం. రిలయన్స్‌ వాటాలను ఇచ్చి ఈ పూర్తి వ్యాపారాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రెండు సంస్థల నుంచి ఎటువంటి సమాచారం వెల్లడికాలేదు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని