ఏపీకి వెళ్లాలంటే ..అనుమతి తప్పనిసరి
close

తాజా వార్తలు

Updated : 01/07/2020 16:23 IST

ఏపీకి వెళ్లాలంటే ..అనుమతి తప్పనిసరి

అమరావతి: జాతీయ రహదారిపై అంతరాష్ట్ర ప్రయాణాలకు అనుమతి అవసరం లేదని కేంద్ర హోంశాఖ ఆన్‌లాక్‌ 2.0 మార్గదర్శకాల్లో తెలిపింది. దీంతో పలువురు అనుమతి లేకుండానే స్వస్థలాలకు వెళ్తున్నారు.  ముఖ్యంగా  తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చేందుకు అనుమతి విషయంలో సందిగ్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టత ఇచ్చారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారిని అనుమతించే విషయంలో నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.  రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, ఆంక్షలు కొనసాగుతాయని డీజీపీ  వెల్లడించారు.  ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి  సరిహద్దుల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశాకే అనుమతిస్తామని తెలిపారు.  
రాష్ట్రంలోకి రావాలంటే తప్పనిసరిగా పాస్‌ తీసుకోవాలని, పాస్‌ ఉన్నవారిని ఉదయం 7గంటల నుంచి రాత్రి 7గంటల వరకే అనుమతిస్తామని చెప్పారు. 
రాత్రిపూట అనుమతి లేదని,  రాత్రి వేళల్లో అత్యవసర, నిత్యావసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.  స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని పాస్‌(అనుమతి) పొందాలని సూచించారు. పరిస్థితిని అర్ధం చేసుకుని ప్రజలు సహకరించాలని డీజీపీ కోరారు.  నిన్న ఉదయం నుంచి పాసులు లేకుండా ఏపీలోకి వచ్చేందుకు ప్రయత్నించిన వందలాది మందిని పోలీసులు వెనక్కి పంపించారు. రాత్రి 7గంటలు దాటిన తర్వాత పాసులు ఉన్న వారిని అనుమతించకపోవడంతో పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని