పోలీసులపై హైకోర్టులో రేవంత్‌ పిటిషన్‌
close

తాజా వార్తలు

Published : 13/06/2020 02:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోలీసులపై హైకోర్టులో రేవంత్‌ పిటిషన్‌

హైదరాబాద్‌: డ్రోన్‌తో చిత్రీకరణ ఆరోపణల విషయంలో పోలీసులుపై ఎంపీ రేవంత్ రెడ్డి హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. మాదాపూర్‌ ఏసీపీ శ్యాంప్రసాద్‌రావు, నార్సింగి ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ను చేరుస్తూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. గతంలో డ్రోన్‌ చిత్రీకరణ ఆరోపణలపై రేవంత్‌ రెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 41ఏ నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేసి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఏడేళ్లలోపు శిక్ష ఉండే కేసుల్లో 41ఏ నోటీసు ఇచ్చిన తర్వాతే అవసరమైతే అరెస్టు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించారని పేర్కొన్నారు. డ్రోన్‌తో చిత్రీకరించారన్న ఆరోపణలతో తనపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్టు తెలియగానే.. స్వయంగా వెళ్లి 41ఏ నోటీసు ఇస్తే వివరణ ఇస్తానని కోరినట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయినప్పటికీ తనకు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారని ఆరోపించారు. తనను జైలుకు పంపించే ఉద్దేశంతోనే తనకు సంబంధం లేని కేసులను కూడా రిమాండ్ నివేదికలో ప్రస్తావించారన్నారు. సుప్రీం తీర్పును ఉల్లంఘించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని