close

తాజా వార్తలు

Published : 11/07/2020 00:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొడుకును సీఎం చేయడం కోసమే.. : రేవంత్‌

హైదరాబాద్‌: ఇవాళ తెలంగాణాలో బ్లాక్ డే అని.. కేసీఅర్ ఇతర మతాల విశ్వాసాలు, ఆచారాలను దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. 16 మంది ముఖ్యమంత్రులు పాలించిన సచివాలయాన్ని ఇప్పుడు కూల్చి వేయడం దారుణమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ‘వాస్తు పేరుతో కేసీఆర్ సచివాలయాన్ని కూల్చివేయడం మంచిది కాదు. తన కొడుకును సీఎం చేయడం కొసమే సచివాలయం కూల్చివేస్తున్నారు. సెంటిమెంట్ తప్పు కాదు, కానీ మూఢ నమ్మకాలు మంచివి కావు. వందల కోట్ల రూపాయలు వృథా చేస్తున్నారు. కోర్టును తప్పుదోవ పట్టించారు. మంత్రివర్గంలో తుది నిర్ణయం తీసుకోలేదని మేం వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. అన్ని రకాల పర్యావరణ అనుమతులు లేకుండా ఎలా కూల్చుతారు? కూల్చివేసిన గార్బెజ్‌ను ఎక్కడ వేస్తారో చెప్పాలి’

‘సచివాలయంలో మసీదు, నల్ల పోచమ్మ గుడి, చర్చిని కూల్చారు. తెలంగాణ ఉద్యమానికి నల్ల పోచమ్మ గుడి వేదికైంది. ఇప్పుడు వాటిని కూల్చి ఆయా వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా సీఎం కేసీఅర్ వ్యవహరించారు. సచివాలయాన్ని కూల్చేయాలని సీఎస్‌ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిని కేసీఆర్‌ రాత్రికి రాత్రే ఆదేశించారు. కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేసి.. ఎవరినీ ఆ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లకుండా చేసి కూల్చారు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ సమీపంలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేయవద్దని సుప్రీం కోర్టు తీర్పు ఉంది. ఒకరిద్దరు ఉద్యోగ సంఘాల నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. వారు స్వాగతించడం సరైంది కాదు. కేసీఆర్.. మసీదు, నల్ల పోచమ్మ గుడి కూల్చితే భాజపా, మజ్లిస్ పార్టీల నేతలు ఎందుకు స్పందించడం లేదు’ అని రేవంత్‌ ప్రశ్నించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని