close

తాజా వార్తలు

Published : 29/07/2020 22:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కేసును ముంబయికి బదిలీ చేయండి: రియా

ముంబయి: బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య కేసు మలుపులు తిరుగుతోంది. సుశాంత్‌ స్నేహితురాలు రియా చక్రవర్తిపై ఆయన తండ్రి కేకే సింగ్‌ పట్నా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పట్నాలో తనపై నమోదు చేసిన కేసు దర్యాప్తును ముంబయికి బదిలీ చేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసినట్టు ఆమె తరఫు న్యాయవాది సతీష్‌ మనేషిందే వెల్లడించారు. 

తన కుమారుడి నుంచి రియా చక్రవర్తి డబ్బులు తీసుకుందని, ఆత్మహత్య చేసుకొనేలా ప్రేరేపించిందని ఆరోపిస్తూ సుశాంత్‌  తండ్రి కేకే సింగ్‌ పట్నాలో ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన బిహార్‌ పోలీసులు రియా కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే  పోలీసు అధికారుల బృందం ముంబయి చేరుకొని దర్యాప్తు కొనసాగిస్తోంది. 

ఈ ఏడాది జూన్‌ 14న సుశాంత్‌ ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ముంబయి పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా సుశాంత్‌ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు పలువురు బాలీవుడ్‌ ప్రముఖులను సైతం విచారిస్తున్నారు. అయితే, మంగళవారం సాయంత్రం సుశాంత్‌ తండ్రి రియా చక్రవర్తిపై ఆరోపణలు చేస్తూ పట్నాలోని రాజీవ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

Panch Pataka

దేవతార్చన