
తాజా వార్తలు
అవకాశం రానివారికీ ధన్యవాదాలు: రోహిత్
నిరాశ చెందకుండా జట్టు ముందుకు సాగేలా ప్రోత్సహించారు
ఇంటర్నెట్‌డెస్క్: ముంబయి వరుసగా రెండో ఏడాది టీ20 లీగ్ ఛాంపియన్‌గా నిలిచింది. మంగళవారం దిల్లీని చిత్తు చేసి ఐదోసారి విజేతగా అవతరించింది. దీంతో ఆ జట్టు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్‌శర్మ తన ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌లో సమావేశమయ్యాడు. ఈ టోర్నీ జరిగినన్ని రోజులూ క్రమశిక్షణతో మెలిగారని సభ్యులను అభినందించారు. పలువురికి అవకాశాలు రాకపోయినా నిరాశచెందకుండా జట్టు ముందుకు సాగడానికి కృషిచేశారని చెప్పాడు. ఈ వీడియోను ముంబయి గురువారం ట్విటర్లో పంచుకుంది.
‘ముందుగా మనందరికీ అభినందనలు. ఇదో గొప్ప సీజన్. అయితే, మన సీజన్ ప్రారంభమైంది ఆగస్టులో కాదు. అంతకన్నా ముందు జూన్‌లోనే. లాక్డౌన్ లాంటి కష్టతరమైన సమయంలోనే అది మొదలైంది. ఇక యూఏఈకి వచ్చాక అంతా కొత్త వాతావరణం నెలకొంది. బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో కూడా ఆటగాళ్లంతా క్రమశిక్షణతో మెలిగారు. హోటల్ గదులకే పరిమితమయ్యారు. మైదానంలోనూ ఎంతో నిబద్ధతగా కొనసాగారు. అందుకే ఇప్పుడు ట్రోఫీతో నిలిచాం. అలాగే ఈ సీజన్లో ఆడే అవకాశం రాని వారికి ధన్యవాదాలు. తుది జట్టులో లేమనే నిరాశ చెందకుండా నిరంతరం అండగా నిలిచారు’ అని రోహిత్ పేర్కొన్నాడు.
అలాగే ఈ సందర్భంగా తమ సహాయక సిబ్బందికి, వైద్య బృందానికి కూడా ముంబయి కెప్టెన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. లీగ్ దశలో గాయం బారిన పడిన తాను త్వరగా కోలుకునేందుకు వారు కృషిచేశారని చెప్పాడు. ఈ కారణంగా రోహిత్ పలు మ్యాచ్‌ల్లో ఆడని సంగతి తెలిసిందే. అనంతరం కోలుకొని ప్లేఆఫ్స్‌లో ఆడినా విఫలమయ్యాడు. ఇక ఫైనల్లో కెప్టెన్ ఇన్నింగ్స్ (68) ఆడి జట్టుకు మరో టైటిల్‌ను అందించాడు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- తాగడానికి తగని సమయముంటదా..!
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- ఆఖరి రోజు ఆసీస్‌కు భయం.. ఎందుకంటే!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
